Site icon NTV Telugu

FaceBook Love: పెళ్లి చేసుకోమంటే ఇటుకతో కొట్టి చంపిన ప్రియుడు

Facebook Love

Facebook Love

FaceBook Love: సోషల్ మీడియా ప్రియుడి ప్రేమ కోసం భర్త, పిల్లలను వదిలేసిన ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. ఫేస్‌బుక్ బాయ్‌ఫ్రెండ్‌ను కలవడానికి నిజామాబాద్‌ నుంచి ఉత్తరప్రదేశ్‌కు వెళ్లిన ఓ వివాహిత అతడి చేతిలో ప్రాణాలు కోల్పోయిశవమై కనిపించింది. వివరాల్లోకి వెళితే… నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో ముఖిద్-ఉస్మాభేగం దంపతులకు ఇద్దరు పిల్లలు. పెళ్లయిన 12 ఏళ్ల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి కొంతకాలంగా విడిపోయి ఇటీవలే మళ్లీ కలిశారు. భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉన్న సమయంలో ఉస్మాకు సోషల్ మీడియాలో ఉత్తరప్రదేశ్‌లోని అమ్రేహ జిల్లాకు చెందిన హెజాద్‌తో పరిచయం ఏర్పడింది. ఇది ప్రేమకు దారితీసింది. షెహజాద్ మాయమాటలు నమ్మి భర్తనే కాకుండా పెంచి పోషించిన పిల్లలను సైతం వదిలి వెళ్లేందుకు సిద్ధపడింది. ఉస్మాభేగం తన సోషల్ మీడియా ప్రేమికుడిని కలవడానికి ఈనెల (నవంబర్) 6న ఇంటి నుంచి బయలుదేరింది. భార్య ఆచూకీ లభించకపోవడంతో ముఖిద్ పోలీసులను ఆశ్రయించడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Read also: Tamilnadu Rains: పొంగిపొర్లుతున్న డ్యామ్‌లు, నీటమునిగిన వీధులు.. తమిళనాడును ముంచెత్తిన వర్షాలు

అయితే బాన్సువాడలో అదృశ్యమైన ఉస్మాభేగం ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలోని గజరౌలాకు వెళ్లింది. సెక్యూరిటీ కంపెనీ కీ షాజాద్ వద్ద ఉండడంతో ఉస్మాను అక్కడికి తీసుకెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని ఉస్మా కోరగా షాజాద్ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కోపోద్రిక్తుడైన షాజాద్ ఉస్మాను చున్నీతో కట్టి చేతిలోని ఇటుకతో తలపై కొట్టాడు. ఆమె తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లి కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయింది. ఉస్మా మృతదేహాన్ని అక్కడే వదిలేసి షాజాద్ పారిపోయాడు. రెండు మూడు రోజుల తర్వాత కంపెనీ సిబ్బంది మృతదేహాన్ని గుర్తించి గాజరావుల పోలీసులకు సమాచారం అందించారు. మహిళ మృతదేహంతో లభించిన ఆధారాలను బట్టి ఆమెను నిజామాబాద్ జిల్లాగా గుర్తించారు. అదృశ్యమైన మహిళ ఉస్మాగా గుర్తించారు. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు మృతదేహాన్ని తీసుకురావడానికి యూపీ వెళ్లారు. సుఖవంతమైన జీవితంలోకి ప్రవేశించిన సోషల్ మీడియా స్నేహం చివరకు ఓ వివాహిత జీవితాన్ని బలిగొంది. ఇలాంటి సంఘటనలను దృష్టిలో ఉంచుకుని సోషల్ మీడియా స్నేహాలను నమ్మి మోసపోవద్దని పోలీసులు తెలిపారు. షాజాద్‌ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Fact Check on Cm jagan: సీఎం జగన్ కి అవమానం జరగలేదు..వాస్తవం ఇదీ!

Exit mobile version