Site icon NTV Telugu

Mukarram Jah: ఎనిమిదో నిజాం నవాబు ముకరం ఝా ఇకలేరు..

Mukharamjaa

Mukharamjaa

nizam of hyderabad mukarram jah passes away: హైదరాబాద్ ఎనిమిదో నిజాం నవాబు భర్కత్ అలీ ఖాన్ వల్షన్ ముకరం ఝా బహదూర్ శనివారం నిన్న రాత్రి పదిన్నర గంటలకి టర్కీలోని ఇస్తాంబుల్‌లో ముకరం ఝా కన్నుమూశారు. ముకరం ఝా అంత్యక్రియలు తన స్వగ్రామమైన హైదరాబాద్‌లో జరగాలన్నది ఆయన కోరిక. ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు ముకరం ఝా మృతదేహాన్ని టర్కీ నుంచి హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు.

Read also: Beauty Mistakes: అందంగా కనిపించాలంటే ఈ తప్పులు చేయకండి

ముకరం ఝా పార్ధివ దేహాన్ని ఈ నెల 17న హైదరాబాద్ తీసుకురానున్నారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చిన అనంతరం ముకరం ఝా భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం చౌమల్లా ప్యాలెస్‌లో ఉంచనున్నారు. హైదరాబాద్ యొక్క ఏడవ , చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 14 జూన్ 1954న ప్రిన్స్ ముకరం ఝాను తన వారసుడిగా ప్రకటించాడు. ముకరం ఝా 1971 వరకు హైదరాబాద్ యువరాజుగా పిలువబడ్డాడు. 1954 నుండి ముకరం ఝా హైదరాబాద్‌కు ఎనిమిదవ రాజుగా గుర్తింపు పొందాడు. 1971లో అప్పటి కేంద్ర ప్రభుత్వం దేశంలోని సంస్థలను రద్దు చేసింది.
Sankranti Wishes: సంక్రాంతి పండుగ సంతోషం నింపాలి.. రాష్ట్ర ప్రజలకు ప్రముఖులు శుభాకాంక్షలు

Exit mobile version