NTV Telugu Site icon

Nirmal: నిర్మల్‌ లో ఉద్రిక్తత.. ఇథనాల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన..

Nirmal

Nirmal

Nirmal: నిర్మల్‌ జిల్లాలోని దిలావర్‌పూర్‌లో ఉద్రికత్త కొనసాగుతుంది. ఇథనాల్‌ పరిశ్రమకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళనలు చేపట్టారు. నిన్న రాత్రి పరిశ్రమకు వ్యతిరేకంగా నాలుగు గ్రామాల రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో జిల్లా అధికారులు 20 మంది రైతులను చర్చకు రావాలని ఆహ్వానించారు. మరోవైపు గుండంపల్లిలో ఆందోళన చేస్తున్న వారిని అదుపులో తీసుకునేందుకు పోలీసులు రెండు వాహనాల్లో వెళ్లారు. అక్కడ ఆందోళన చేస్తున్న వారిని వాహనాలు ఎక్కించే క్రమంలో స్థానికులకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఎందుకు అదుపులో తీసుకుంటున్నారని స్థానికులు ప్రశ్నించారు. ఏది ఏమైనా ఇథనాల్ పరిశ్రమను అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.

Read also: Nizamabad: క్లినిక్ లపై తెలంగాణ వైద్య బృందం తనిఖీలు.. నకిలీ వైద్యుల గుట్టు రట్టు..

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ వద్ద జాతీయ రహదారిపైకి మహిళలు పెద్ద సంఖ్యలో వచ్చి నిరసన తెలిపారు. దిలావర్ పూర్ లో నిర్మించనున్న ఇథనాల్ పరిశ్రమను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వందలాది మంది మహిళలు కుటుంబ సమేతంగా జాతీయ రహదారిపై రోడ్లపై కూర్చొని నిరసన తెలిపారు. అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయకులు కనిపించడం లేదంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. పరిశ్రమ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వారు నిరసన తెలుపుతుండగా ఆర్డీఓ రత్న కల్యాణి అటువైపు రావడంతో ఆమె వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ క్రమంలో సుమారు మూడు గంటల పాటు రత్న కల్యాణి వాహనం అక్కడే నిలిపివేశారు. ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి నిరసనలు కొనసాగుతున్నాయి. వారంతా రోడ్డుపైనే వంటలు చేసి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేశారు. నిన్నటి నుంచి ఇప్పటి వరకు అనగా 24 గంటలుగా ఉద్రిక్తల నడుమ నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి.
Adani Group: అమెరికాలో కేసులపై అదానీ గ్రూప్ క్లారిటీ..