NTV Telugu Site icon

MLA Maheshwar Reddy: పేద భూములను కబ్జా చేసిన వారిని విడిచి పెట్టేది లేదు..

Maheshwar Reddy

Maheshwar Reddy

కాంగ్రెస్‌ ప్రభుత్వం సభా విధానాలు, సంప్రదాయాలను ఉల్లంఘించి సీనియర్‌ సభ్యులను కాదని అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఎంతమాత్రం సరికాదని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ది కోసం, మజ్లీస్ పార్టీ మెప్పు కోసం, కొన్ని వర్గాల ప్రజలను ఆకర్షించేందుకే ప్రభుత్వం పనిగట్టుకొని ఈ నిర్ణయాన్ని తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also: Komatireddy Rajagopal Reddy: మునుగోడు నియోజకవర్గంలో బెల్ట్ షాపులు ఉండవు.. ఎవరి మాట వినా..

ప్రభుత్వం సభ సంప్రదాయాలను ఉల్లంఘించడం వల్లనే బీజేపీ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచిన సభ్యులు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేయలేరని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఏ వర్గానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో ఎంఐఎం, బీజేపీ దోస్తులని కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేసిందని.. ప్రస్తుతం ఆ పార్టీ నిజస్వరూపం బయటపడిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకే రక్తమని, మూడు పార్టీలు ఒకే నావపై ప్రయాణం చేస్తున్నాయి ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా ప్రొటెం స్పీకర్ నియమించడంపై వ్యతిరేకించి అసెంబ్లీ ఎదుట నిరసన తెలిపామని ఇదే విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నెల 14న దళిత బిడ్డ, స్పీకర్ గా నియమితులైన ప్రసాద్ సమక్షంలో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు.

Read Also: Siddipet: గూగుల్ మ్యాప్ తెచ్చిన ముప్పు.. ప్రాజెక్టులోకి దూసుకెళ్లిని డీసీఎం వ్యాన్

నిర్మల్ లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని డీ1 పట్టాలు చేసిన జాబితా సిద్ధంగా ఉందని, ఒక్కొక్కటి బయటకు తీస్తామని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తెలిపారు. పేద భూములను కబ్జా చేసిన వారిని విడిచి పెట్టేది లేదని, దీనిపై కమిషన్ వేసి నిజానిజాలను బయటకు తీస్తామని పేర్కొన్నారు. భూ అక్రమలపై అసెంబ్లీలో గళమెత్తుతామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసపూరిత మేనిఫెస్టోను రూపొందించి అధికారంలోకి వచ్చిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే హర్షిస్తామని, లేనట్లయితే ప్రభుత్వంపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

Show comments