గత రెండు సంవత్సరాలుగా అగ్రదేశమైన అమెరికాతో పాటు యావత్తు ప్రపంచ దేశాలను కరోనా భూతం పట్టిపీడిస్తోంది. కొత్తకొత్తగా రూపాంతరాలు చెందుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించి కరోనా వైరస్ కు టీకాను కనుగొన్నారు. అయితే కరోనా ఫస్ట్ వేవ్ అనంతరం కోవిడ్ టీకా పంపిణీ మొదలైన.. అప్పటికే కరోనా డెల్టా వేరియంట్ రూపంలో మరోసారి సెకండ్ వేవ్ సృష్టించింది. దీంతో ప్రపంచ దేశాలు సైతం కోవిడ్ టీకా పంపిణీని యుద్ధ ప్రతిపాదిక అమలు చేశారు. దీంతో కరోనా తగ్గుముఖం పట్టింది. భారత్ లోనూ కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వాక్సినేషన్ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా కేసులు తగ్గుతూ వస్తున్న తరుణంలో దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తో మరోసారి కరోనా రక్కసి ప్రజలపై విరుచుకుపడుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ వంటి దేశాల్లో కోవిడ్ టీకా 75 శాతం జనాభాకు పంపిణీ చేసినా కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి.
అయితే.. ఈ వేరియంట్ ఇప్పటికే పలు దేశాలతో పాటు ఇండియాలోకి కూడా ప్రవేశించింది. అంతేకాకుండా దాని ప్రభావాన్ని చూపుతోంది. దీంతో దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్నాయి. డెల్టా వేరియంట్ కంటే శరవేగంగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతుండడంతో థర్డ్ వేవ్ మొదలైంది. కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్ లాంటి రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు ఇప్పటికే నైట్ కర్ఫ్యూ, వీకెండ్ లాక్ డౌన్ లో విధించాయి. దీంతో కరోనా కేసులు అదుపులోకి వచ్చాయి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా రోజుకు 10వేల పై చిలుకు కరోనా కేసులు నమోదవుతుండడంతో ఏపీ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ను విధించింది. అయితే తెలంగాణ సైతం కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూ వస్తున్నాయి. దీనికి తోడు 2సంవత్సరాలకు ఓసారి నిర్వహించే, తెలంగాణకే తలమానికమైన మేడారం సమ్మక్క-సారక్క జాతర ఈ సమయంలోనే ఉండడం ఆందోళన కలిగించే విషయం.
మేడారం జాతరకు దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మేడారం జాతరలో కరోనా కేసులు పెరిగి అవకాశం కనిపిస్తోంది. ఏపీలో కూడా రోజుకు 5 వేల లోపు కరోనా కేసులు నమోదవుతుండగా.. సంక్రాంతి పండుగ తరువాత 10వేలకు పైగా రోజువారీ కరోనా కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణాలో రోజూ 4 వేలకు దగ్గరగా కేసులు నమోదవుతున్నాయి. నిన్న తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. తెలంగాణలో కరోనా పాజిటివిటీ రేటు 10 దాటితే కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని తెలిపారు. అయితే మేడారం తరువాత కరోనా కేసులు పెరిగితే తెలంగాణ సర్కార్ తెలంగాణాలో నైట్ కర్ఫ్యూ విధించే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.