పోలీసు ఉద్యోగాలకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నవిషయం తెలిసిందే.. దీనికి సంబంధించిన మొదటి ప్రక్రియ ఆగస్టు నెలలో ప్రిలిమ్స్ పరీక్ష జరగనుండటంతో.. ఉన్నతాధికారులు అభ్యర్థులకు ఓ ముఖ్యమైన సూచన చేశారు. అయితే గతంలో జరిగిన పోలీస్ ప్రిలిమ్స్ పరీక్షలో నెగెటివ్ మార్కలుండేవి కావని, తొలిసారిగా తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఈసారి జరగబోయే పోలీస్ ప్రిలియ్స్ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ ను పెట్టిందన్న విషయాన్ని అభ్యర్థులకు గుర్తు చేసింది. 2018 నోటిఫికేషన్ సమయంలో పీడబ్ల్యూటీలో అర్హత పొందేందుకు కేటగిరీల వారీగా వేర్వేరు మార్కులు సాధించాల్సి వచ్చేదని.. ఓసీలైతే 40 శాతం.. బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు 30శాతం రావాల్సి ఉండేది. అప్పట్లో నెగెటివ్ మార్కులుండేవి కావు.
read also: Flood Warning: గోదావరికి వరద భయం.. ముంపులో లంక గ్రామాలు
ఈసారి అందుకు భిన్నంగా అన్ని కేటగిరీల అభ్యర్థులకు 30 శాతమే అర్హతగా పరిగణించనున్నారు. కాగా.. 200 మార్కులున్న ప్రశ్నపత్రంలో 60 సరైన సమాధానాలు గుర్తించగలిగితే తదుపరి అంకమైన శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించగలుగుతారు. ఓఎంఆర్ షీట్‌లో ఎలాంటి బబ్లింగ్ లేకుండా ఉన్న సమాధానాలకు సున్నా మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాకాకుండా బబ్లింగ్ చేసిన జవాబు తప్పయితే నెగెటివ్ మార్కులు వేయనున్ననేపథ్యంలో.. ఐదు తప్పుడు సమాధానాలకు ఒక్కో నెగెటివ్ మార్కు పడనుంది. కావున అభ్యర్థులు ఊహించి సమాధానాలు రాయకపోవడమే ఉత్తమమని మండలి ఉన్నతాధికారులు సూచిస్తున్నారు. దీంతో అభ్యర్థులు ప్రిపరేషన్ వేగం పెంచారు.. ఎలాగైనా ఉద్యోగాన్ని సాధించాలన్న తపనతో అభ్యర్థులు రాత్రిపగలు కష్టపడుతున్నారు.
ఈనేపథ్యంలో.. ఈసారి పలు కారణాలతో భారీగా దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. తొలుత 17,291 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. వీటిలో 587 ఎస్సై పోస్టులు కాగా సుమారు 2.47 లక్షల దరఖాస్తులొచ్చాయి. ఈనేపథ్యంలో.. 16,704 కానిస్టేబుళ్ల పోస్టులకు దాదాపు 9.54 లక్షల మంది దరఖాస్తు చేయగా.. పరిశీలనంతరం ఎస్సై పోస్టులకు సుమారు 2.45 లక్షలు, కానిస్టేబుల్ పోస్టులకు 6.5 లక్షల దరఖాస్తులే మిగిలాయని, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వేర్వేరు విభాగాలకు వేర్వేరు సెల్‌నంబర్లతో దరఖాస్తులు చేసుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా మండలి వర్గాలు గుర్తించాయి.