NTV Telugu Site icon

President Election 2022: హైదరాబాద్‌ రానున్న ద్రౌపది ముర్ము

Droupadi Murmu

Droupadi Murmu

భారత 16వ రాష్ట్రపతి ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24వ ముగియనుండగా.. కొత్త రాష్ట్రపతి కోసం జులై 18న ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమైంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇక, ఈ నెల 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోవైపు.. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము ఓవైపు, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా మరోవైపు ప్రచారంలో మునిగిపోయారు.. అందులో భాగంగా ఈ నెల 12వ తేదీన హైదరాబాద్‌కు రానున్నారు ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ప్రత్యేక విమానంలో బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌కు రానున్న ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.. అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో పరిచయ కార్యక్రమం ఉంటుంది.. ఇక, తెలంగాణకు చెందిన మేధావులతో సదస్సులో పాల్గొననున్నారు ద్రౌపది ముర్ము.

Read Also: Gummadi : మరపురాని గుమ్మడి అభినయం!

కాగా, ఇప్పటికే విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌లో పర్యటించారు.. ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్‌ శ్రేణులు.. బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి భారీ ర్యాలీ కూడా నిర్వహించారు.. ఓవైపు బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతోన్న సమయంలో యశ్వంత్‌ సిన్హా పర్యటనతో టీఆర్ఎస్‌ హడావుడి చేశారు.. యశ్వంత్‌ సిన్హాకు టీఆర్ఎస్‌ ప్రజాప్రతినిధుల పరచయ కార్యక్రమం వేదికగా.. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తిన విషయం తెలిసిందే.