Narendra Modi: సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించారు. మోదీ ఈ రైలును వర్చువల్ గా ప్రారంభించారు. ఈ రైలును ప్రారంభించిన అనంతరం ప్రదాని మోడీ ప్రసంగించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వందేభారత్ పండుగ కానుక అని ప్రధాని మోడీ అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య వేగవంతమైన ప్రయాణానికి ఈ రైలు అవకాశం కల్పిస్తుందని మోడీ అభిప్రాయపడ్డారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు వల్ల రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఈ రైలుతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ప్రయాణ సమయం కూడా తగ్గుతుందని మోడీ చెప్పారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో పూర్తిగా స్వదేశీ రైళ్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని మోడీ అన్నారు. దేశ భవిష్యత్తు మారుతుందనడానికి వందే భారత్ ఓ ఉదాహరణ అని మోడీ పేర్కొన్నారు. 2023లో ప్రారంభం కానున్న తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇదేనని ఆయన వివరించారు.అతి తక్కువ సమయంలో ఏడు వందల భారతీయ రైళ్లను ప్రారంభించామని ప్రధాని తెలిపారు. ఈ రైళ్లలో ఇప్పటికే 40 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు.
Read also: Governor Tamilisai: ఆసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచండి.. ఇది నా రిక్వెస్ట్
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ సందర్భంగా రెండు రాష్ట్రాల మధ్యలో తొలి ట్రైన్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. మోడీకి తెలుగు ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. రైల్వేస్ కాని, ఏర్వేస్ కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇంత అభివృద్ది జరగలేదన్నారు. కొత్త టెక్నాలజీ తో సికింద్రాబాద్ నుఅభివృద్ధి చేస్తామన్నారు. దీనికి త్వరలో ఫౌండేషన్ ని ప్రధాని మోడీ వేయనున్నారని తెలిపారు.
Read also: BRS Flexi in AP: ఏపీలో భారీగా కేసీఆర్, కేటీఆర్ ఫెక్సీలు.. సంక్రాంతి బరిలో బీఆర్‌ఎస్
గవర్నర్ తమిళ సై మాట్లడుతూ.. ఈ కార్య్రమానికి రావడం ఆనందంగా ఉందని, గత 8 ఏళ్లుగా రైల్వే ఎంతో అభివృద్ధి చెందుతోందని తెలిపారు. వోకల్ ఫర్ లోకల్ అనేది కనపడుతోందని తెలిపారు. వ్యాక్సిన్ ని కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నామని అన్నారు. ఇలాంటి ట్రైన్స్ ని చూసినప్పుడు ఎంతో ఆనందం కలిగిస్తుందని గవర్నర్ అన్నారు. ఇలాంటి ట్రైన్స్ సమయం ఆదా అవుతుంది, ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపుతుందని ఆశిస్తున్నామన్నారు. సామాజిక, ఆర్థిక సంబంధాలు మెరుగుపడతాయని తెలిపారు. ఇండియా ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీ అన్నారు తమిళిసై. అన్ని సెక్టార్స్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ ప్రజల తరపున మోడీకి దన్యవాదాలు తెలిపారు.