Site icon NTV Telugu

బాధ్యతతో మెలగండి.. ఈ ఏడాదిలోనైనా కరోనా నుంచి విముక్తి..!

ఈ నూతన సంవత్సరంలోనైనా కరోనా మహమ్మారి నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు సినీ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేసిన నందమూరి బాలకృష్ణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే ఒమిక్రాన్ వేరియంట్‌తో మహమ్మారి మరో మారు విజృంభిస్తున్న వేళ అందరూ మరింత బాధ్యతతో మెలుగుతూ పూర్తి శక్తి సామర్థ్యాలతో రోగులకు సేవలు అందేలా చూడాలని సూచించారు. ఇంతటి విపత్కర పరిస్థితులలో క్యాన్సర్ లాంటి వ్యాధితో భాదపడే వారికి హాస్పిటల్ లోనికి వచ్చినంతనే స్వాంతన కలిగించేలా చూస్తూ అవసరమైన వైద్యాన్ని అందించడంలో విజయం సాధించారని.. ఆ కోవలోనే నూతన సంవత్సరంలోనూ ముందుకు సాగాలని సూచించారు బాలయ్య.

Read Also: సినిమా టికెట్లపై కూడా రాజకీయం.. వాళ్లంతా పేదలకు శత్రువులే..!

ఇక, నూతన సంవత్సరం సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ ఛైర్మన్ నందమూరి బాలకృష్ణ.. తెలుగు ప్రజలకు, అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్త సంవత్సరంలో అందరూ సంతోషంగా, సంపదతో సరితూగాలని, దాంతో పాటూ ఆరోగ్యవంతులై సాగాలని ఆయన ఆకాంక్షించారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో డా. ఆర్ వి ప్రభాకర రావు మాట్లాడుతూ.. గత సంవత్సరంలో సంస్థ సాధించిన విజయాలను వివరిస్తూ భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఇక, కేక్ కటింగ్ కార్యక్రమంలో డా. టియస్ రావు, మెడికల్ డైరెక్టర్, BIACH&RI; డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Exit mobile version