NTV Telugu Site icon

MP.K. Laxman: నంద కుమార్ కు TRS నేతలతో సంబంధాలు ఉన్నాయి

Mp Laxman

Mp Laxman

MP.K. Laxman: తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు యత్నించిన వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది.. మొయినాబాద్‌ ఫాంహౌస్‌ వ్యహారంలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ స్పందించారు. నంద కుమార్ కి TRS నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆయన బీజేపీకి ఎలాంటి సంబందం లేదని తేల్చిచెప్పారు. సీబీఐ లేదా న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఆ ఎమ్మెల్యేలలో ముగ్గురు కాంగ్రెస్ నుండి TRS కి వచ్చిన వారే అని లక్ష్మణ్‌ తెలిపారు. వారిని అప్పుడు ఎంతకు కొన్నారు? అంటూ ప్రశ్నించారు. మునుగోడులో ప్రజలు తమ వైపు లేరనే TRS ఇదంతా చేస్తుందని, నంద కుమార్ కి TRS నేతలకు సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. బీజేపీ నైతిక విలువలకు కట్టుబడి ఉన్న పార్టీ అని బీజేపీ పార్టీ పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలు నమ్మరని బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు లక్ష్మణ్ తెలిపారు.

Read also: Fake Currency Notes From ATM: ఏటీఎం నుంచి చిల్డ్రన్‌ బ్యాంక్‌ నోట్లు.. కంగుతిన్న కస్టమర్‌..

మొయినాబాద్‌ ఫాంహౌస్‌ వ్యహారంలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్‌ చేశారు సైబరాబాద్‌ పోలీసులు.. అయితే, ఆ నలుగురిలో ఒకరైన తాండూరు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఫిర్యాదుతోనే పోలీసులు రంగ ప్రవేశం చేసినట్టు చెబుతున్నారు.. మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డి.. దీంతో.. కేసు నమోదు చేసి, నిందితులను అరెస్ట్‌ చేశారు పోలీసులు.. బీజేపీలో చేరేందుకు 100 కోట్ల రూపాయల డీల్‌ నడిసినట్టు తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి.. ఎమ్మెల్యేలను తీసుకొస్తే 50 కోట్ల రూపాయలు ఇస్తామని తనతో డీలింగ్ నడిచినట్లు పేర్కొన్న యాన.. స్వామీజీ, నందు, సతీష్ కలిసి తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు.. డీలింగ్‌లో భాగంగానే తన ఫామ్ హౌస్ కు వచ్చారని ఫిర్యాదులో తెలిపారు.. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. ఆడియో రికార్డులు, వీడియో రికార్డులు, ఇతర ఆధారాలను కూడా సేకరించారు.. రాత్రే ఆ ముగ్గురిని అరెస్ట్ చేశారు.