Nampally Court: బంజారాహిల్స్ డ్రగ్ కేసు.. నిందితులకు కోర్టులో చుక్కెదురు

high court

high court

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన పుడింగ్‌ పబ్ డ్రగ్స్‌ కేసులో నిందితులకు నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది.. ప‌బ్ యజమాని, మేనేజర్‌ అభిషేక్‌, అనిల్‌ బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది కోర్టు.. అభిషేక్‌, అనిల్‌ బెయిల్‌ పిటిషన్లను కొట్టిపారేసింది నాంప్లి కోర్టు… విచారణ సమయంలో.. బెయిలిస్తే ద‌ర్యాప్తు ప్రభావితం చేస్తార‌న్న పోలీసుల వాద‌న‌తో ఏకీభవించిన కోర్టు.. బెయిల్‌ ఇచ్చేందుకు నిరాకరించింది.. మ‌రోవైపు కొకైన్ ప‌ట్టుబ‌డ‌టంతో నిర్వాహ‌కులు బాధ్యత వ‌హించాల‌ని కోర్టుకు తెలిపారు పోలీసులు… ఇక, ఈ కేసులో మ‌రో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగుతుండగా.. అభిషేక్‌, అనిల్‌ను ఇప్పటికే నాలుగు రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని విచారించారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్‌లో ఉన్నారు నిందితులు.

Read Also: Punjab: సీఎంపై సిద్ధూ పైర్‌.. ఆయ‌నో ర‌బ్బర్ స్టాంప్..!