Akbaruddin Owasi : అక్బరుద్దీన్ ఓవైసీకి భారీ ఊరట
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మజ్లిస్ కీలక నేత, తెలంగాణ అసెంబ్లీలో ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ ద్వేషపూరిత ప్రసంగం కేసులో భారీ ఊరట లభించింది. 2012 డిసెంబర్‌లో హిందువులను ఉద్దేశించి అక్బర్ తీవ్ర వ్యాఖ్యలుచేశారు. నిజామాబాద్, నిర్మల్‌లో చేసిన వ్యాఖ్యలపై ఒక వర్గం తీవ్రంగా స్పందించింది. ఆయన పై కేసులు నమోదయ్యాయి. అక్బరుద్దీన్‌పై రెండు కేసులనూ నాంపల్లి సెషన్స్ కోర్టు బుధవారం నాడు కొట్టవేస్తున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో 2012 డిసెంబర్ నెలాఖరులో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో పర్యటించిన సందర్భంగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అక్బరుద్దీన్ ప్రసంగించారంటూ ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 2013లో అక్బరుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఆ తర్వాత బెయిల్ తీసుకుని అక్బరుద్దీన్ బయటకు వచ్చారు. ఆనాటి నుంచి ఈ కేసును నాంపల్లి కోర్టు విచారిస్తుంది.
Also Read
తాజాగా ఇటీవలే ఈ కేసు విచారణను ముగియడంతో నాంపల్లి కోర్టు ఈ నెల 12న తుది తీర్పు వెలువరించనున్నట్లు తెలిపింది. అయితే మంగళవారం నాడు తీర్పును మరోమారు వాయిదా వేసిన కోర్టు.. బుధవారం నాడు తన తుది తీర్పును వెలువరించింది. ఈ తీర్పులో అక్బరుద్దీన్ ని నిర్దోషిగా పేర్కొన్న కోర్టు.. కేసును కొట్టేస్తున్నట్లుగా వెల్లడించింది.
తాజావార్తలు
-
BRICS: ఇరాన్ అధ్యక్షుడితో ప్రధాని మోడీ భేటీ.. వారాల వ్యవధిలో రెండోసారి..
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
-
Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్‌కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
-
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?