Nalgonda: పోలీస్ కస్టడీకి అనుముల తహసీల్దార్ జయశ్రీ..
- 36 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన కేసు..
- పోలీసులు కస్టడీలోకి నల్గొండ జిల్లా అనుముల తాహసీల్దార్ జయశ్రీ..
- జయశ్రీతో పాటు ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ ..
- ఒక్కరోజు పోలీసు కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతి..
- ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు జయశ్రీ-జగదీష్ లను ప్రశ్నించనున్న పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda: ప్రభుత్వ భూములను అక్రమంగా బదలాయింపు కేసులో రిమాండ్‌లో ఉన్న తహసీల్దార్ వజ్రాల జయశ్రీని హుజూర్‌నగర్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. 36 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన కేసులో నల్గొండ జిల్లా అనుముల తాహసీల్దార్ జయశ్రీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జయశ్రీతో పాటు ధరణి కంప్యూటర్ ఆపరేటర్ జగదీష్ కి పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. ఒక్కరోజు పోలీసు కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. ఇద్దరిని హుజూర్ నగర్ సబ్ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. జయశ్రీ, జగదీష్ లను ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ప్రశ్నించనున్నారు.
Read also: Buttermilk Sugar: మజ్జిగ పంచదార కలిపి తాగుతున్నారా..?
Also Read
- Criminal Gang : నల్లగొండలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్ అరెస్ట్.. రూ.53 లక్షల సొత్తుతో.!
- Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
- Telangana Tourism: పర్యాటకులకు తెలంగాణ టూరిజం బోర్డ్ గుడ్ న్యూస్..
హుజూర్‌నగర్ మండలం బూరుగడ్డ రెవెన్యూ పరిధిలోని 36 ఎకరాల భూమికి అప్పటి తహసీల్దార్ జయశ్రీ, ధరణి ఆపరేటర్ జగదీష్ సహకారంతో పాస్ పుస్తకాలు రూపొందించి రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు వసూలు చేశారు. 2019లో ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట తహసీల్దార్ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. రైతుబంధు నిధుల్లో సగం తహసీల్దార్, ఆపరేటర్ జగదీష్ పంచుకున్నట్లు విచారణలో తేలింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బుధవారం తహసీల్దార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అయితే జయశ్రీని 5 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా.. ఇరువైపు వాదనలు విన్న కోర్టు శుక్రవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే ఆమెను పోలీస్ కస్టడీకి అనుమతించారు. మరోవైపు జయశ్రీని రిమాండ్‌కు తరలించడంతో స్థానిక ఉద్యోగుల్లో కొందరిలో వణుకు మొదలైంది. జయశ్రీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Ponguleti Srinivas Reddy: మాటలతో కాదు.. చేతలతో చూపించేది ఇందిరమ్మ ప్రభుత్వం..
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!