Buttermilk Sugar: చాలా మంది నిద్ర లేవగానే ఒక గ్లాసు మంచినీళ్లు తాగుతుంటారు. మరికొందరు బెడ్ మీద కాఫీ లేదా టీ తాగుతారు. ఇది చాలా మందికి ఉండే అలవాటు. కానీ, నిద్ర లేవగానే కడుపునిండా ఒక గ్లాసు మజ్జిగ తాగితే.. అనేక రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మజ్జిగను తరచూ తాగడం వల్ల శరీరానికి చల్లదనాన్ని అందించే, జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అయితే.. మజ్జిగలో ఉప్పు కలుపుకుని తాగేవారి సంఖ్య ఎక్కువే అని చెప్పాలి. ఇక మరికొందరు అయితే.. మజ్జిగలో పంచదార తీసుకుంటారు. కానీ మజ్జిగలో పంచదార కలుపుకోవడం వల్ల లాభాలు, నష్టాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగలో పంచదార కలుపుకుని తింటే శరీరానికి త్వరగా శక్తి వస్తుంది. మజ్జిగలో ఉండే లాక్టిక్ యాసిడ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చక్కెర రుచిని పెంచడమే కాకుండా జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. మజ్జిగలో క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు బలం చేకూరుతుంది.
Read also: Ponguleti Srinivas Reddy: మాటలతో కాదు.. చేతలతో చూపించేది ఇందిరమ్మ ప్రభుత్వం..
మజ్జిగలో చెక్కెర వేసుకుని తాగడం వల్ల నష్టాలు..
చక్కెరలో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల, మజ్జిగలో ఎక్కువ చక్కెరను తాగడం వల్ల శరీరంలో కేలరీలు పెరిగి బరువు పెరుగుతారు. చక్కెర రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ఇది చాలా ప్రమాదకరం. చక్కెర బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది దంతాలను దెబ్బతీయడమే కాకుండా చిగుళ్ల వ్యాధిని కలిగిస్తుంది. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు, అజీర్ణం, గ్యాస్ సమస్యలు వస్తాయి. చక్కెరను ఎక్కువగా తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధులు (కార్డియోవాస్కులర్ డిసీజ్), అధిక కొలెస్ట్రాల్, క్యాన్సర్ వంటి సమస్యలు కూడా వస్తాయి.
Read also: Minister Ponnam Prabhakar: ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కు మంత్రి పొన్నం భూమి పూజ..
మజ్జిగలో పంచదారకు బదులు తేనె..
పంచదారకు బదులు తేనె లేదా పటిక బెల్లంతో కలుపుకోవచ్చు. మజ్జిగలో పుదీనా ఆకులు, నిమ్మరసం కలిపి తీసుకుంటే రుచిగా ఉంటుంది. రోజుకు ఒక గ్లాసు మజ్జిగ తీసుకుంటే సరిపోతుంది. ఏదైనా ఆహారాన్ని ఆరోగ్యకరమైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యం. ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్యులను సంప్రదించడం మంచిది. మజ్జిగ చాలా ఆరోగ్యకరమైన పానీయం అయినప్పటికీ, ఇందులో చక్కెర శాతం ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
Banjara Hills Crime: జువెలరీ షాప్ లో రూ.6 కోట్ల ఆభరణాలు మాయం కేసులో ట్విస్ట్..