NTV Telugu Site icon

Nalgonda: పోలీస్‌ కస్టడీకి అనుముల తహసీల్దార్‌ జయశ్రీ..

Nalgonda

Nalgonda

Nalgonda: ప్రభుత్వ భూములను అక్రమంగా బదలాయింపు కేసులో రిమాండ్‌లో ఉన్న తహసీల్దార్ వజ్రాల జయశ్రీని హుజూర్‌నగర్ కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించింది. 36 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని ప్రైవేట్‌ వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేసిన కేసులో నల్గొండ జిల్లా అనుముల తాహసీల్దార్‌ జయశ్రీని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. జయశ్రీతో పాటు ధరణి కంప్యూటర్‌ ఆపరేటర్‌ జగదీష్‌ కి పోలీస్‌ కస్టడీలోకి తీసుకున్నారు. ఒక్కరోజు పోలీసు కస్టడీకి మాత్రమే కోర్టు అనుమతించింది. ఇద్దరిని హుజూర్‌ నగర్‌ సబ్‌ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. జయశ్రీ, జగదీష్‌ లను ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు పోలీసులు ప్రశ్నించనున్నారు.

Read also: Buttermilk Sugar: మజ్జిగ పంచదార కలిపి తాగుతున్నారా..?

హుజూర్‌నగర్‌ మండలం బూరుగడ్డ రెవెన్యూ పరిధిలోని 36 ఎకరాల భూమికి అప్పటి తహసీల్దార్‌ జయశ్రీ, ధరణి ఆపరేటర్‌ జగదీష్‌ సహకారంతో పాస్‌ పుస్తకాలు రూపొందించి రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు వసూలు చేశారు. 2019లో ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట తహసీల్దార్ పట్టాదారు పాస్ పుస్తకాలు జారీ చేశారు. రైతుబంధు నిధుల్లో సగం తహసీల్దార్, ఆపరేటర్ జగదీష్ పంచుకున్నట్లు విచారణలో తేలింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో బుధవారం తహసీల్దార్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, జూనియర్ సివిల్ జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. అయితే జయశ్రీని 5 రోజులు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా.. ఇరువైపు వాదనలు విన్న కోర్టు శుక్రవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మాత్రమే ఆమెను పోలీస్‌ కస్టడీకి అనుమతించారు. మరోవైపు జయశ్రీని రిమాండ్‌కు తరలించడంతో స్థానిక ఉద్యోగుల్లో కొందరిలో వణుకు మొదలైంది. జయశ్రీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Ponguleti Srinivas Reddy: మాటలతో కాదు.. చేతలతో చూపించేది ఇందిరమ్మ ప్రభుత్వం..