Nalgonda Bus Fire: విజయవాడ హైవేపై ట్రావెల్స్ బస్సు దగ్ధం.. ప్రాణాలతో బయటపడ్డ 36 మంది ప్రయాణికులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nalgonda Bus Fire: హైదరాబాద్-విజయవాడ హైవేపై మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి సమీపంలో ఈ రోజు తెల్లవారుజామున ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న రెయిన్బో ట్రావెల్స్‌కు చెందిన బస్సులో మంటలు చెలరేగగా.. ప్రమాద సమయంలో 36 మంది ప్రయాణికులు బస్సులో ఉండగా.. అందరూ సురక్షితంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం ప్రకారం, ప్రయాణ మధ్యలో బస్సు ఇంజన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పరిస్థితిని వెంటనే గుర్తించిన డ్రైవర్ అప్రమత్తమై బస్సును రోడ్డుపక్కన నిలిపివేసి ప్రయాణికులను వెంటనే దిగిపోవాలని హెచ్చరించాడు. దీంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటకు వచ్చారు. అయితే కొద్దిసేపటికే మంటలు బస్సు అంతటా వ్యాపించి పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు మరియు అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది. బస్సులో మంటలు చెలరేగడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.
Also Read
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
JNTU Sultanpur : జేఎన్టీయూ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. ఇద్దరు సీనియర్లు సస్పెండ్
-
Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!