Uttam Kumar Reddy: నల్లగొండ జిల్లాలోని బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్ట్ ను రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రేపు సీఎం పర్యటనలో భాగంగా.. బ్రాహ్మణ వెళ్ళంల గ్రామంలో ప్రాజెక్టు వద్ద ఏర్పాట్లను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. రేపు సీఎం చేతుల మీదుగా బ్రాహ్మణ వెల్లంలా ప్రాజెక్ట్ ప్రారంభమవుతుందని తెలిపారు.
Read also: Eatala Rajendar: రేపు రాష్ట్రానికి జేపీ నడ్డా.. సభా ప్రాంగణం పర్యవేక్షించిన ఎంపీ ఈటెల..
కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పేరు వస్తుందని గత ప్రభుత్వం బ్రాహ్మణ వెళ్ళంలా ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. గత ప్రభుత్వం హయాంలో ఎస్ ఎల్ బి సి కూడా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజాప్రతినిధులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణ వెళ్ళాంల ప్రాజెక్టును సాధించడంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర చాలా కీలకం అన్నారు. ఆయన కలల ప్రొజెక్ట్ 18 ఏళ్లకు సాకారం అవుతుందన్నారు.
Zip Saree: మహిళలకు ఊరట.. ఇప్పుడు కేవలం10 సెకన్లలో చీర కట్టుకోవచ్చు..ఈ వీడియో చూడండి