NTV Telugu Site icon

Munugode Bypolls: పోటాపోటీగా టీఆర్‌ఎస్‌, బీజేపీ సభలు.. 30న కేసీఆర్‌, 31న నడ్డా

Kcr Nadda

Kcr Nadda

Munugode Bypolls: తెలంగాణలో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలు హాట్‌ టాపిక్‌. ఉప ఎన్నికల ప్రచారానికి మరో వారం రోజులు మిగిలి ఉంది. దీంతో.. బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ లు వేగం పెంచాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ అయితే మంత్రులను, ఎమ్మెల్యేలను మునుగోడుకు పంపి ఉప ఎన్నికల్లో విజయం సాధించాలని ప్రయత్నాలు వేగవంతం చేసింది. అయితే..ఇప్పటివరకూ ప్రచారం ఓ మోస్తరుగా జరిగింది. అయితే.. దీపావళి పండుగ రావడంతో రెండు రోజులు సొంతూళ్లకు వెళ్లారు నేతలు. అయితే.. మునుగోడులో క్లైమాక్స్ ప్రచారం చేయడానికి సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా.. అక్టోబర్ 30న చండూరు మున్సిపాలిటి పరిధిలోని బంగారిగడ్డ వద్ద సీఎం కేసీఆర్‌ బహిరంగ సభ నిర్వహించనున్నారు. మనుగోడు ప్రచారం మరో రెండు రోజుల్లో ముగుస్తుందనగా కేసీఆర్ ప్రచారం చేస్తే పార్టీకి ప్లస్ పాయింట్ అవుతుందని టాక్‌.. అయితే టీఆర్‌ఎస్‌ కు ధీటుగా వెళ్లేందుకు బీజేపీ ప్లాన్‌ వేస్తుంది. తెలంగాణలో అధికారం కోసం ఎదురుచూస్తున్న కమలనాథులు అక్టోబర్ 31న మునుగోడులో బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈసభకు ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ ఎంపీ లక్ష్మణ్‌.. పలువురు కేంద్ర మంత్రులు, కీలక నేతలు బీజేపీ నిర్వహించనున్న సభకు హాజరవుతారని టాక్‌.

Read also: Mallikarjun Kharge: కాంగ్రెస్‌ కొత్త సారథిగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున ఖర్గే

అయితే.. ఇదంతా చూస్తే ఆగస్టులో సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇక, ఆగస్టు 21న సీఎం కేసీఆర్‌ మునుగోడులో సభ నిర్వహించారు. ఆతరువాత రోజు ఆగస్టు 22న కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్‌ బహిరంగ సభలో పాల్గొన్నారు. ఇక మరోసారి కేసీఆర్ సభలో పాల్గొన్న తరువాత మరుసటి రోజే జేపీ నడ్డా బీజేపీ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈనేపథ్యంలో.. దీపావళి పండుగ సమయంలోనూ నియోజకవర్గంలోనే ఉండి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పరిస్థితులను పర్యవేక్షించి, నడ్డా సభకు భారీ ఎత్తున జనాన్ని సమీకరించే ప్రయత్నాల్లో పార్టీ నేతలు బిజీగా ఉన్నారు.
Rapolu Anand Bhaskar Resigns: బీజేపీకి రాపోలు రాజీనామా.. నడ్డాకు లేఖ..