Army Jawan: అనారోగ్యంతో ఆర్మీ జవాన్ మృతి చెందిన ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. నల్లగొండ జిల్లా అనుమల మండలం మదారిగూడెం కు చెందిన ఈటరీ మహేష్ ఆర్మీ జవాన్ గా ఎంపికై అస్సాంలో రెండు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. జూలై 9న తీవ్ర జ్వరంతో బాధపడుతున్న మహేష్ ను.. డిబ్రూఘర్ జిల్లా మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చేర్పించారు ఆర్మీ అధికారులు. చికిత్స పొందుతుండగా మహేష్ పరిస్థితి విషమించడంతో కోమాలోకి వెళ్లిపోగా… ఈనెల 25న తుది శ్వాస విడిచాడు. మహేష్ సోదరుడు కూడా ఆర్మీ జవాన్ గా ప్రస్తుతం జమ్ము కాశ్మీర్ లో విధి నిర్వహణలో ఉన్నారు. దేశ రక్షణ కొరకు తన ఇద్దరు కుమారులను ఆర్మీలోకి పంపగా.. చిన్న కుమారుడు మహేష్ మిగతాజీగా తిరిగి రావడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరు అవుతుంది. మృతదేహాన్ని విమానంలో స్వస్థలానికి తరలించేందుకు ఆర్మీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తుంది. మార్చ్ నెలలోనే సెలవుపై వచ్చి వెళ్లిన మహేష్ జ్ఞాపకాలను గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. అధికార లాంఛనాల ప్రకారం ప్రత్యేక హెలికాప్టర్‌లో ఈరోజు మహేష్ డెడ్ బాడీని సికింద్రాబాద్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
Read also: Gold Rate Today: మగువలకు శుభవార్త.. హైదరాబాద్‌లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
విధి నిర్వహణలో మరణించిన ఈరేటి మహేష్ తండ్రి యాదయ్యకు ముగ్గురు పిల్లలు ఉండగా, అతని రెండవ కుమారుడు ఈరేటి నరేష్ 2019 సంవత్సరంలో మిలటరీలో చేరాడు. నరేష్ జమ్మూ కాశ్మీర్‌లోని మహర్‌లో భద్రతా దళాలలో పనిచేస్తున్నాడు. సైనికుడిగా ఉంటూ దేశానికి కూడా సేవ చేస్తానని, అగ్నిపథ్ పథకంలో భాగంగా 2022లో ఉద్యోగం సాధించానని మహేశ్ చెప్పాడు. గ్రామానికి చెందిన ఈరేటి మహేష్ ఆర్మీలో పనిచేస్తూ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్దఎత్తున మహేష్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. దేశ భద్రత కోసం తన ప్రాణాలను సైతం త్యాగం చేయకుండా తన బాధ్యతలను నిర్వర్తించిన మహేశ్ తమ గ్రామానికి గర్వకారణమని గ్రామస్తులు తెలిపారు. కొడుకు అకాల మరణంతో మహేశ్ తల్లి పార్వతమ్మ గుండెలవిసేలా రోదిస్తూ అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
MLC Kavitha: కవిత సీబీఐ లిక్కర్ కేసు.. నేడు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ..