Site icon NTV Telugu

Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల్లో మరో వివాదం… డ్యాం పై చల్లారని నీటి మంటలు

Nagarjuna Sagar

Nagarjuna Sagar

Nagarjunasagar: తెలుగు రాష్ట్రాల్లో మరో వివాదం మొదలైంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ఇరిగేషన్‌ అధికారుల మధ్య మళ్లీ జల ఘర్షణ చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ డ్యాం వద్ద మీటర్‌ రీడింగ్‌ కోసం వెళ్లిన తెలంగాణ అధికారుల బృందాన్ని ఏపీ ఇరిగేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. రైట్ కెనాల్ వద్ద తెలంగాణ అధికారులకు ఇక్కడేం పని అంటూ ప్రశ్నించారు. ఇక్కడికి రావద్దంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య ఈవిషయమై వాగ్వాదం జరిగింది. ఏపీ అధికారుల తీరుపై కృష్ణా రివర్‌ మేనేజ్‌ మెంట్‌ బోర్డుకి తెలంగాణ ఇరిగేషన్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. కాగా.. డ్యామ్ నిర్మాణ సమయం నుండి తెలంగాణ ప్రభుత్వం నాగార్జునసాగర్ డ్యాం నిర్వాహన బాధ్యతలు చేపడుతుంది. అయితే.. గత కొంతకాలంగా తరచు వివాదాలకు నాగార్జునసాగర్ డ్యాం కేరాఫ్ గా మారిన విషయం తెలిసిందే.. గత ఏడాది (2023) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదం జరిగి రచ్చకు దారితీసింది. ఈనేపథ్యలో తెలంగాణలో రెండు వైపులా ఆయా ప్రభుత్వాలు భారీగా పోలీసులను మోహరించారు. డ్యాం వైపు ఎవరిని అనుమతించలేదు. నోఎంట్రీ బోర్డును సైతం ఏర్పాటు చేశారు. ఇప్పుడు మళ్లీ జల వివాదం తలెత్తడంతో అటు ఏపీ, ఇటు తెలంగాణ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుస్తు చర్యలో భాగాంగా పోలీసులు భారీగా మోహరించారు.
Dulquer Salmaan : ఓవర్సీస్ లో వన్ ‘మిలియన్ భాస్కర్‌’

Exit mobile version