NTV Telugu Site icon

Breaking News: బురదలో చిక్కుకున్న ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీలు..

Slbc

Slbc

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. 8 గంటలవుతున్నా ఇంకా ఎనిమిది మంది ఆచూకీ లభించలేదు. శిథిలాల్లోనే 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. మరోవైపు.. సంఘటనా స్థలంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. కాగా.. ఎనిమిది ప్రాణాలపై ఆశలు సల్లగిల్లుతున్నాయి. శ్రీశైలం ఎడమగట్టు ఎస్ఎల్‌బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న 8 మంది కార్మికులు ఇతర రాష్ట్రాలకు చెందిన వారే..

Read Also: SLBC Tunnel Accident: శ్రీశైలం ఎడమగట్టు కాలువ ప్రమాదస్థలికి మంత్రులు ఉత్తమ్, జూపల్లి..

ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో ఇద్దరు ఇంజనీర్లు, ఆరుగురు కూలీలు మట్టి, బురదలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. వారిని రక్షించేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు చేపడుతున్నారు. అందుకోసం.. ఎన్డీఆర్ఎఫ్‌ను కూడా పిలిపిస్తున్నట్లు మంత్రులు ఉత్తమ్, జూపల్లి తెలిపారు. అంతేకాకుండా.. భారత సైన్యం, రెస్క్యూ టీమ్ సహాయ కూడా కోరామన్నారు. టన్నెల్ బోరింగ్ మిషన్‌తో పని మొదలు పెట్టగా.. మట్టి, నీరు వచ్చి చేరిందని.. అది 8 మీటర్ల మేరకు చేరిందని పేర్కొన్నారు.

Read Also: Belagavi: మరాఠీ మాట్లాడనందుకు బెళగావిలో కండక్టర్‌పై దాడి..

మరోవైపు.. టన్నెల్ ప్రమాదంలో ఇద్దరు అమెరికన్ కంపెనీ ఇంజనీర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఆరుగురు జయప్రకాష్ అసోషియేట్స్ ఉద్యోగులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. గల్లంతైన రాబిన్స్ కంపెనీ ఉద్యోగులు అమెరికన్లా..? ఇండియన్ల అన్నదానిపై క్లారిటీ లేదు. కాగా.. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద ఉదయం భారీ ప్రమాదం చోటుచేసుకుంది. ఈరోజు ఉదయం 8:30 గంటల సమయంలో మూడుమీటర్ల మేర పైకప్పు కూలిపోయిన ఘటనలో ఏడుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. టన్నెల్ పనులు జరగుతున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ప్రాజెక్టు పరిసరాల్లో తీవ్ర కలకలం రేగింది. ఎడమవైపు సొరంగ పనులు జరుగుతుండగా, 14వ కిలోమీటర్ వద్ద ప్రమాదం సంభవించింది.