Lakshmareddy: ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలకు తమ నుంచి హామీలిస్తూ.. తమను గెలిపించాలని కోరుతున్నారు. తాము చేసిన అభివృద్ధిని వివరిస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. అందులో భాగంగానే.. నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలంలో నేడు జడ్చర్ల బీఆర్ఎస్ అభ్యర్ధి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాచాలపల్లి, ఉర్కొండపేట, జకినాలపల్లి, గునగుంట్లపల్లి తదితర గ్రామాల్లో ప్రచారం కొనసాగించారు.
Read Also: Sukumar: లెక్కల మాష్టారు లెక్కేసి కొడితే 100 కోట్లు కూడా తక్కువే!
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కేవలం ఎన్నికలప్పుడు కనిపిస్తారని, తరువాత వారి జాడ ఎవరికి తెలియదని అన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి మనందరి భవిష్యత్తు కోసం ఓటువేయాలని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ చాలా సాధించిందని.. ఇంకా చాలా సాధించాల్సి ఉందని అన్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎట్లా ఉండేది.. ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం ఎట్లా ఉందో ఒకసారి చూడాలన్నారు. కాంగ్రెసోళ్లకి పదవుల మీద యావ తప్ప.. జనాల మీద ప్రేమ ఉండదని విమర్శించారు. కాబట్టి రాబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీ అందించాలని కోరారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే ఓటర్లు పట్టం కడుతారని, డిసెంబర్3 తర్వాత కేసీఆర్ సీఎం పదవి చేపట్టి హ్యాట్రిక్ కొడతారని లక్ష్మారెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Uttar Pradesh: ప్రవక్తను అవమానించాడని కండక్టర్‌పై దాడి.. ఎన్‌కౌంటర్ చేసి నిందితుడి అరెస్ట్..