CM Revanth Reddy: నేడు రంగారెడ్డిలో సీఎం పర్యటన.. ఫాక్స్‌కాన్ పనుల పురోగతిపై సమీక్ష
- వరుస యాత్రలతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీబిజీ..
- నేడు ముఖ్యమంత్రి రేవంత్ రంగారెడ్డి జిల్లాలో పర్యటన..
- సాయంత్రం 4 గంటలకు కొంగరకలాన్ చేరుకోనున్న రేవంత్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస యాత్రలతో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే దసరా పండుగ నేపథ్యంలో యథావిధిగా నాగర్ కర్నూల్ జిల్లా సొంతూరు కొండారెడ్డిపల్లె, ఆ తర్వాత తన నియోజకవర్గం కొడంగల్ లో సీఎం పర్యటించిన సంగతి తెలిసిందే. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం తో పాటు మంత్రి శ్రీధర్‌బాబు పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు రేవంత్ రెడ్డి కొంగరకలాన్ చేరుకుంటారు. అక్కడ ఫాక్స్ కాన్ కంపెనీ పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. కాగా, 2023లో ఫాక్స్ కాన్ కంపెనీ తెలంగాణకు వచ్చింది.. కొంగరకలాన్ లో 250 ఎకరాల్లో ఎలక్ట్రానిక్ కంపెనీని ఏర్పాటు చేయాలని ఫాక్స్ కాన్ నిర్ణయించింది. దాదాపు లక్ష మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ఫాక్స్‌కాన్ సీఈవో యంగ్ లియు వెల్లడించారు.
Read also: Kishan Reddy: హైదరాబాద్ లో ఇది నాలుగో సంఘటన.. అయినా స్పందించరా..
Also Read
- ACB Raids : ఏసీబీకి చిక్కిన ఎస్సై.. సంబరాలు చేసుకున్న గ్రామస్థులు..
- Ragging: మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. గతేడాది బాధితుడే.. నేడు నిందితుడు..!
- Karthika Pournami: శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు.. శివాలయాల్లో భక్తుల పూజలు..
- Srisailam Ghat Road: శ్రీశైలం ఘాట్ రోడ్డులో విరిగిపడుతున్న కొండచరియలు..
కొడంగల్ పర్యటన అనంతరం నిన్న(ఆదివారం) మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకున్న రేవంత్ నేరుగా బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి నిర్వహించిన అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా అందరితో గౌరవింపబడే వ్యక్తి దత్తాత్రేయ అన్నారు. అలయ్ బలయ్.. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిందన్నారు. పొలిటికల్ జేఏసీ ఏర్పాటుకు.. అలయ్ బలయ్ స్ఫూర్తి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో.. రాజకీయ పార్టీలన్నీ ఒకే వేదిక మీదకు వచ్చే అవకాశం లేకుండే అన్నారు. అలయ్ బలయ్ తెలంగాణ సంప్రదాయాల వేదిక అని తెలిపారు. రాజకీయాలకు సంబంధం లేదన్నారు.
Minister Seethakka: దివ్యాంగులు ఆఫీసర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు.. మెసేజ్ చేస్తే చాలు..
తాజావార్తలు
-
OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!
-
Story Board : బంగ్లా మరో పాకిస్తాన్ లా మారుతుందా..?
-
Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లకు ఫుల్ డిమాండ్.. 7,340 ఇళ్లకు 35 వేల దరఖాస్తులు!
-
Russia-India Rail Route: భారత్‌కు రైల్వే మార్గం.. రష్యా కీలక ప్రతిపాదన..
-
Lionel Messi’s Father Passed Away: మెస్సీ కన్నీళ్ల వెనుక అసలు కారణం ఇదేనా? తండ్రి జార్జ్ ఇక లేరు
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!