Batti Vikramarka: నల్గొండ జిల్లా నకిరేకల్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ పాదయాత్ర కొనసాగుతుంది. అందులో భాగంగా కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఆ సభలో భట్టి మాట్లాడుతూ.. పాదయాత్ర తన స్వార్థం కోసం చేయడం లేదని.. సమస్త తెలంగాణ ప్రజల ప్రయోజనం కోసమే పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ చేతిలో పెడితే కేసీఆర్ అప్పులపాలు చేశాడని ఆరోపించారు. సాగునీరు ఇవ్వడంలో.. రైతుల రుణమాఫీలలో విఫలమయ్యారని భట్టి అన్నారు.100 సంవత్సరాలకు సరిపోయే తెలంగాణ సంపదను కేసీఆర్ కుటుంబం దోచేసిందని విమర్శించారు. కేసిఆర్ లాంటి వారు ఈ దేశంలో చాలామంది వచ్చారు… పోయారు కానీ కాంగ్రెస్ పార్టీని ఏమి చేయలేకపోయారని దుయ్యబట్టారు.
Read Also: Pawan Kalyan: ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ పేరు తెలిసిపోయిందిరోయ్.. ఇక రచ్చ షురూ చేయండి
మరోవైపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుబంధు నిలిపివేస్తామని బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తుందని భట్టి అన్నారు. అంతేకాకుండా ధరణి పోర్టల్ లో రైతు అనుకూల సమూలమార్పులు చేస్తామని తెలిపారు. నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ కంచుకోట… ఆ కంచుకోటను ఎవరూ బద్దలు కొట్టలేరని భట్టి గాండ్రించారు. నకిరేకల్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఎమ్మెల్యేను ప్రలోభాలకు గురిచేసి బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని.. పార్టీ మారాలనుకుంటే రాజీనామా చేసి మళ్లీ ఎన్నికల్లోకి వెళ్లాలని భట్టి పేర్కొన్నారు. ఒక పార్టీ నుండి గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం అంటే తమకు ఓట్లేసిన ఓటర్లను అవమానించడమే అని అన్నారు.
Read Also: Dharmana Prasada Rao: వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోకి కట్టుబడి పని చేస్తుంది
రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ 24 లక్షల బడుగు బలహీన, దళిత వర్గాలకు భూమిని పంచితే.. ఆ భూమిని ధరణి పేరుతో లాక్కోవడానికి బిఆర్ఎస్ ప్రభుత్వం సిద్ధమైందని భట్టి విక్రమార్క తెలిపారు. ఐదు నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని.. అధికారంలోకి రాగానే పేదలకు భూమిని పెంచుతామన్నారు. ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణం మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని.. రిక్రూట్మెంట్ క్యాలెండర్ ను రూపొందిస్తామని తెలిపారు. మరోవైపు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతామన్నారు. ఎల్కేజీ నుండి పీజీ వరకు ఉచిత ఇంగ్లీష్ మీడియం నిర్బంధ విద్యను అందిస్తామని భట్టి విక్రమార్క హామీలిచ్చారు.