NTV Telugu Site icon

టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అంతరించే పార్టీలు..

రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రం లో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీలు అంతరించే పార్టీలు అని మధ్యప్రదేశ్ బీజేపీ ఎన్నికల ఇంచార్జి మురళీధర్ రావు అన్నారు. కోవిడ్ వ్యాప్తి పెరగకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ముందు జాగ్రత్తల వల్లనే అత్యధిక ప్రాణ నష్టం జరగలేదని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ల నిర్మాణాల ఊసే లేదని ఫైర్‌ అయ్యారు. దేశ వ్యాప్తంగా అమలు అవుతున్న ఆయుష్మాన్ భవ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో రెండు సంవత్సరాలుగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. పదకొండు యూనివర్సిటీలలో వీసీలు లేకుండా ఎలా విద్య నేర్పిస్తారని… తెలంగాణ రాష్ట్రం సాధించాక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని ఆశగా ఎదురు చూస్తే , టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగ కల్పన చేయలేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిని గెలిపించి టీఆర్‌ఎస్‌ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు.