Site icon NTV Telugu

Amit Shah: గిరిజనులను కాంగ్రెస్ మోసం చేసింది..

Amit Sha

Amit Sha

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ములుగులో బీజేపీ సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడనందుకు క్షమించండి అని తెలిపారు. సమ్మక్క సారలమ్మ తల్లులు, రామప్ప రుద్రేశ్వరుడు ఆశీర్వాదంతో ఇక్కడ అడుగు పెట్టానన్నారు. ఇదిలా ఉంటే.. ములుగు జిల్లాలో గిరిజన విశ్వద్యాలయంను ప్రధాని మంజూరు చేశారని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ సర్కార్ ను అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ సందర్భంగా.. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పిస్తామన్నారు. ట్రైబల్ విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తామని తెలిపారు. మరోవైపు.. పోడు పట్టాల కోసం గిరిజన, గిరిజనేతరుల మధ్య బీఆర్ఎస్ విభేదాలు సృష్టించిందని ఆరోపించారు. గిరిజనులను కాంగ్రెస్ మోసం చేసిందని తెలిపారు. ఓ గిరిజన నేత ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన సర్కార్ మోదీ సర్కార్ అని అన్నారు

Uttarakhand Tunnel: రెస్క్యూ కోసం ఇండియన్ ఆర్మీకి పిలుపు.. వర్టికల్ డ్రిల్లింగ్ ప్రారంభం..

దేశంలో గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అధికంగా బీజేపీలోనే ఉన్నారని అమిత్ షా తెలిపారు. 2013-14 వరకు దేశం మొత్తంలో గిరిజనులకు బడ్జెట్ తక్కువగా ఉండేది కానీ.. బీజేపీ వచ్చాక పెంచారని అన్నారు. ఏకలవ్య పాఠశాలలు బీజేపి ప్రభుత్వము ఏర్పాటు చేసింది.. 50 లక్షల మంది గిరిజన కుటుంబాలకు ఇళ్లనూ మంజూరు చేశామన్నారు. 1 కోటి మంది గిరిజన రైతులకు ప్రతీ సంవత్సరం 6 వేలు ఇస్తుంది, దాన్ని 12 వేలకు పెంచుతామని తెలిపారు. బీజేపీని గెలిపిస్తే కమలాపురం బిల్ట్ ఫ్యాక్టరిని పునరుద్ధరిస్తామని అమిత్ షా చెప్పారు. అంతేకాకుండా.. హైదరాబాద్ విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామన్నారు. కేసీఆర్ ను తొలగించాలి అనుకుంటే కేవలం బీజేపీకి మాత్రమే ఓటు వేయండని తెలిపారు. మిషన్ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు, ఔటర్ రింగ్ రోడ్డు పనులలో, మియాపూర్ భూముల్లో కేసీఆర్ అవినీతి ఉందని అమిత్ షా ఆరోపించారు. అయోధ్యలో రామ మందిరం జనవరిలో ప్రారంభం కానుందని.. అయోధ్యలో రామ మందిర దర్శనంకు ఖర్చు మొత్తం బీజేపీ ప్రభుత్వమే భరిస్తుందని ఈ సందర్భంగా అమిత్ షా చెప్పారు.

Bandi Ramesh: చేసిన అభివృద్ధి ఏంటి?.. ఎమ్మెల్యేను ప్రశ్నించిన బండి రమేష్

Exit mobile version