NTV Telugu Site icon

TG High Court: నేటి వరకు ఏటూరునాగారంలోనే మావోయిస్టుల మృతదేహాలు..

Moviest

Moviest

TG High Court: ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను ఈరోజు (డిసెంబర్ 3) వరకు ఏటూరునాగారంలోని ఆస్పత్రిలోనే భద్రపర్చాలని పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూసేందుకు పిటిషనర్‌ కాల్వల ఐలమ్మకు పర్మిషన్ ఇవ్వాలని పేర్కొనింది. అలాగే, పోస్టుమార్టంలో పాల్గొన్న డాక్టర్లు, ఫోరెన్సిక్‌ నిపుణుల వివరాలను అందించాలని సైతం ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది. కాగా, పోలీసులు తన భర్త మల్లయ్య మృతదేహాన్ని చూడనివ్వడం లేదని ఐలమ్మ అనే మహిళ నిన్న హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

Read Also: Parliament Session 2024: ప్రతిష్టంభనకు తెర.. నేటి నుంచి సజావుగా పార్లమెంట్ ఉభయసభలు!

కాగా దీనిపై జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌ రెడ్డి ధర్మాసనం విచారణ చేసింది. పిటిషనర్‌ తరఫున లాయర్ డి.సురేశ్‌ కుమార్‌ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం తన భర్త మృతదేహాన్ని చూసేందుకు అనుమతించాలని ములుగు ఎస్పీకి ఆదేశాలు ఇచ్చింది. అలాగే, పోస్ట్‌మార్టం చేసేటప్పుడు బంధువులు ఎవరినైనా అనుమతించాలని తెలిపింది. ఇక, ఏడుగురి మావోయిస్టుల మృతదేహాలకు నిన్న (సోమవారం) రాత్రి డాక్టర్లు పోస్టుమార్టం పూర్తి చేశారు. అయితే, పోస్టుమార్టం తర్వాత కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించాల్సి ఉండగా హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడింది. ఈరోజు మధ్యాహ్నం హైకోర్టు తీర్పు వచ్చే వరకు మావోయిస్టుల మృతదేహాలను కుటుంబ సభ్యులకు పోలీసులు అప్పగించే అవకాశం ఉంది. పోస్ట్ మార్టం అయినా ఏడు మృతదేహాలను ఫ్రీజర్లలో అధికారులు భద్రపరిచారు.

Show comments