MP Soyam Bapurao: ఆ దాడులు చేయించింది తెలంగాణ ప్రభుత్వమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Soyam Bapurao Fires On Attack On Tribal Farmers: పోడు భూముల సమస్యని సాకుగా చూపి.. అటవీ అధికారులు, పోలీసుల చేత ఆదివాసులపై తెలంగాణ ప్రభుత్వం దాడులు చేయించిందని ఎంపీ సోయం బాపురావ్ ఆరోపించారు. ఈ ఘటనలపై మానవ హక్కుల కమిషన్ స్పందించి.. బాధ్యులైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ కార్యాలయానికి వెళ్లిన సోయం బాపురావ్.. ఛైర్మన్ జస్టిస్ ఏకే మిశ్రా, సెక్రటరీ జనరల్ దేవేందర్ కుమార్ సింగ్‌లను కలిశారు. తెలంగాణలో ఏజెన్సీ ప్రాంతాల్లో పోడు భూముల సమస్యకు ఇంతవరకూ పరిష్కారం లభించలేదని.. ఆ భూముల్ని అటవీ అధికారులు బలవంతంగా లాక్కొని, ఆదివాసీ గుడేల నుండి అడవి బిడ్డలను తరలించేందుకు కుట్ర జరుగుతోందని వారికి ఫిర్యాదు చేశారు.
ఇటీవల మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోషగూడ గ్రామంలో అడవి బిడ్డలపై ఫారెస్ట్ పోలీస్ అధికారులు దాడులు చేసి, వారిని తీవ్రంగా గాయపరిచారని సోయం బాపురావ్ చెప్పారు. అంతేకాదు.. వారిపై అక్రమ కేసులు కూడా బనాయించారని వివరించారు. అలాగే.. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ పాత జిల్లాల పరిధిలోని ఏజెన్సీ భూముల్లో ఆదివాసులకు పట్టా ఇవ్వకుండా ఫారెస్ట్ అధికారులు నిర్బంధ చర్యలు సాగిస్తున్నారని వెల్లడించారు. కోయపోషగూడలో 12 మంది మహిళలను జైలుకు పంపి, వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని తెలిపారు. ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన జస్టిస్ కే మిశ్రా.. అమానుషంగా దాడులు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై నివేదిక తెప్పించుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని మానవ హక్కుల కమిషన్ తమకు హామీ ఇచ్చినట్టు సోయం బాపురావు వివరించారు.
Also Read
తాజావార్తలు
-
Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
-
Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
-
OTR: చిన్నారెడ్డి ఏం చేయబోతున్నాడు..?
-
Story Board : ఉద్యోగ నియామకాల్లో ఎక్కడ తేడా కొడుతోంది ? అన్ని రాష్ట్రాల్లో ఇంతేనా ?
-
BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?