Site icon NTV Telugu

MP K. Laxman : రాబోయే 5 సంవత్సరాలు మనకు విషమ పరీక్ష

K Laxman

K Laxman

కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్న… వారి పోరాటాల, త్యాగాల ఫలితం ఈ గెలుపు అని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు మూడో సారి మోడీ నీ ప్రధాని గా చూడాలని 8 మందిని గెలిపించారు…. తెలంగాణ ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని ఆయన అన్నారు. రాజకీయ ప్రస్థానాన్ని పార్టీ కార్యాలయం లో ప్రారంభించిన కార్యకర్తలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు కేంద్ర మంత్రులు అయ్యారు… వారికి మంత్రి వర్గం లో తీసుకున్నందుకు మోడీ కి సెల్యూట్ చేస్తున్నానన్నారు. కార్యకర్తల కృషి శ్రమ ను విశ్మరించవద్దని మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా అని ఆయన తెలిపారు. ఎంపీలు, ఎమ్మేల్యేలు అందరూ కలసి రాష్ట్రం లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా పనిచేయాలన్నారు.

అంతేకాకుండా.. రాబోయే 5 సంవత్సరాలు మనకు విషమ పరీక్ష. కొత్త పాత కలయికతో పార్టీ విస్తరించాలి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలకు పెద్ద పీఠ వేయాలి. దక్షిణాది వైపు పార్టీ చూస్తుంది… సమాజాన్ని విడదీసే ప్రయత్నం ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చేసింది….. గోల్కొండ కోట పై కాషాయ జండా ఎగురవేసి విధంగా కార్యకర్తలు కృషి చేయాలని ఆయన అన్నారు.

Exit mobile version