NTV Telugu Site icon

Asaduddin Owaisi: ఎంపీ అసదుద్దీన్‌ సంచలన వ్యాఖ్యలు.. 70 ఏళ్లుగా మమ్మల్ని దోచేస్తున్నారు..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Asaduddin Owaisi: హైదరాబాద్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చే శారు.. హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. భారతదేశ పార్లమెంట్‌లో అన్ని వర్గాల ఎంపీలు ఎన్నికై వస్తారు.. కానీ, ముస్లింలు ఏకతాటిపైకి వచ్చి రాజకీయంగా ఓ లీడర్‌ కింద ఎదగడం రాజకీయ పార్టీలకి నచ్చదని విమర్శించారు.. దేశంలో ముస్లింలు రాజకీయ పార్టీలకి బానిసలుగా ఉండాలని పార్టీల నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు.. 70 ఏళ్లుగా మమ్మల్ని ఇదే విధంగా దోచుకున్నారని ఆరోపించారు.. ఈ దేశంలో అగ్రకులస్తులే రాజకీయాల్లో ఉండాలని భావిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన ఒవైసీ.. మైనార్టీ హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, దళితులు ఏకితాటిపైకి రావడం రాజకీయ పార్టీలకి నచ్చదని పేర్కొన్నారు..

Read Also: What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇక, హైదరాబాద్ నగర పోలీస్‌ కమిషనర్‌కి నా విజ్ఞప్తి.. మీరు ప్రత్యేకంగా ఒక స్పెషల్ టీం ఫామ్ చేసి.. తల్వార్లు, కత్తులతో దాడులు చేస్తున్న వారిని ఉక్కు పాదంతో అణిచివేయండి అని విజ్ఞప్తి చేశారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.. వారికి శాశ్వతంగా బెల్ రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.. మరోవైపు.. భారతదేశంలో బీబీసీ కార్యక్రమాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ పై నిషేధించారు.. గుజరాత్ అల్లర్ల సమయంలో ముఖ్యమంత్రి మీరే ఉన్నారు కదా..! గాడ్సే.. గాంధీ హంతకుడు.. అసలు గాడ్సే పైన మీ నిర్ణయం ఏంటి..? అని ప్రధాని నరేంద్ర మోడీని ప్రశ్నించారు. గాడ్సే పై సినిమాని చిత్రకరిస్తున్నారు.. గాంధీ హంతకుడుపై తీయబోతున్న సినిమాని మీరు భారతదేశంలో బ్యాన్‌ చేస్తారా? లేదా? అని నిలదీశారు.. మీ గురించి, బీజేపీ గురించి ప్రచారం చేస్తోన్న వార్తని బ్యాన్‌ చేస్తున్నారు.. మరి గాడ్సేపై తీయబోతున్న సినిమాని భారత దేశంలో బ్యాన్‌ చేస్తారా? లేదా? అని ప్రశ్నల వర్షం కురిపించారు ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ.

Show comments