South Central Railway : మౌలాలిలో రైళ్లకు బ్రేక్.. డీజిల్ ఇంజిన్లతో రంగంలోకి రైల్వే.!
- మౌలాలి వద్ద OHEలో సాంకేతిక లోపం
- శాతవాహన, పల్నాడు, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లకు అంతరాయం
- డీజిల్ ఇంజిన్లతో రైళ్లను ముందుకు తరలింపు
- కాకతీయ ఎక్స్‌ప్రెస్ రూట్ మళ్లింపు.. స్టాప్ రద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
South Central Railway : దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విద్యుత్ మార్గంలో తీవ్ర సాంకేతిక లోపం తలెత్తడంతో పలు కీలక రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మౌలాలి రైల్వే స్టేషన్ సమీపంలో ఓవర్‌హెడ్ ఎక్విప్మెంట్ (OHE) వ్యవస్థలో హఠాత్తుగా సమస్య ఉత్పన్నం కావడంతో సికింద్రాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వైపు వెళ్లే ప్రధాన రైళ్లు నిలిచిపోయాయి. దీంతో వివిధ గమ్యస్థానాలకు వెళ్లాల్సిన వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
గంటల తరబడి నిలిచిపోయిన శాతవాహన, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లు
మౌలాలి స్టేషన్ దాటిన వెంటనే ఓవర్‌హెడ్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో శాతవాహన ఎక్స్‌ప్రెస్ దాదాపు గంటకు పైగా మార్గమధ్యంలోనే ఆగిపోయింది. ఈ ప్రభావంతో వెనుక వస్తున్న పల్నాడు ఎక్స్‌ప్రెస్‌ను మౌలాలి స్టేషన్ వద్దనే అత్యవసరంగా నిలిపివేశారు. అదే సమయంలో సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరాల్సిన విశాఖ ఎక్స్‌ప్రెస్‌ను కూడా అధికారులు ప్లాట్‌ఫారమ్‌పైనే నిలిపివేసారు. ప్రధాన మార్గంలో రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు.
Also Read
- Cricketer Nandini : వికారాబాద్‌లో విషాదం.. బీసీసీఐ అండర్-19 క్రికెటర్ నందిని ఆత్మహత్య
- New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. 'ఆటో నగర్ కాలనీ' పేరుతో కొత్త స్కీమ్..
- Nerella Sharada : మహిళల జీవితాలతో ఆటలు.. ఫెర్టిలిటీ కేంద్రాలకు హెచ్చరిక
- CM Revanth Reddy : రాహుల్ గాంధీ పర్యటనపై బీజేపీకి ఎందుకంత భయం.?
డీజిల్ ఇంజిన్‌తో తాత్కాలిక పునరుద్ధరణ.. యుద్ధప్రాతిపదికన పనులు
విద్యుత్ లైన్లలో తలెత్తిన లోపాన్ని గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. శాతవాహన ఎక్స్‌ప్రెస్‌తో పాటు మౌలాలి వద్ద నిలిచిపోయిన పల్నాడు ఎక్స్‌ప్రెస్‌కు డీజిల్ ఇంజిన్లను అమర్చి, వాటిని తాత్కాలికంగా ముందుకు కదిలించి ట్రాక్‌ను క్లియర్ చేశారు. ప్రస్తుతం ఓవర్‌హెడ్ ఎక్విప్మెంట్ సమస్యను పూర్తిగా పరిష్కరించేందుకు రైల్వే ఇంజనీరింగ్ బృందాలు యుద్ధప్రాతిపదికన పునరుద్ధరణ పనులు చేపడుతున్నాయి. చాలావరకు సమస్యను అధిగమించామని, పనులు త్వరలోనే పూర్తయి రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగుతాయని రైల్వే శాఖ వెల్లడించింది.
కాకతీయ ఎక్స్‌ప్రెస్ రూట్ మళ్లింపు.. మౌలాలిలో స్టాప్ రద్దు
ఈ సాంకేతిక సమస్య , పునరుద్ధరణ పనుల నేపథ్యంలో రైలు నంబర్ 17659 సికింద్రాబాద్–భద్రాచలం రోడ్ కాకతీయ ఎక్స్‌ప్రెస్ మార్గాన్ని అధికారులు మళ్లించారు. ఈ రైలును మల్కాజ్గిరి మార్గం మీదుగా నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మార్గం మళ్లింపు కారణం వల్ల ఈ రైలుకు మౌలాలి రైల్వే స్టేషన్లో నిర్ణయించిన క్రమబద్ధమైన స్టాప్ ఉండదని, ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్‌పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
Janga Glimpse : నోట్లో మందు బాటిల్.. వరలక్ష్మి తూటాల వర్షం
-
AP Govt: ఏపీకి పెట్టుబడుల వెల్లువ.. రూ.32.49 లక్షల కోట్ల మైలురాయి..
-
Cricketer Nandini : వికారాబాద్‌లో విషాదం.. బీసీసీఐ అండర్-19 క్రికెటర్ నందిని ఆత్మహత్య
-
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్‌ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?