పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకునే బావిలో నెట్టి వేసి చంపింది ఓ కసాయి తల్లి. వివరాల్లోకి వెళితే… పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మొగల్ పురకు చెందిన బన్ని (14) అనే బాలున్ని… తన కన్న తల్లి శ్యామల వ్యవసాయ బావిలో నెట్టివేసింది. ఈ ఘటనలో బన్ని అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ దారుణం ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. అయితే.. బన్ని మానసిక స్థితి బాగోలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు.
read also : కంటి ముందుతో ప్రమాదం లేదు..విచారణ చేయండి : ఆనందయ్య
మానసిక స్థితి బాగోలేకనే.. బన్ని బావిలో పడ్డాడని… కూడా వారు పేర్కొన్నారు. కానీ… ఆసుపత్రికి అని చెప్పి.. బన్నిని బావిలో తల్లే వేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే.. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో తల్లి శ్యామల ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.