Drunk And Drive: వామ్మో.. ఒక్కరోజుకే ఇన్ని డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులా..!

Hyderabad

Hyderabad

Drunk And Drive: రాజధాని హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలను అంబరాన్నంటాయి. పలువురు కుటుంబ సమేతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోగా, మరోవైపు హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్స్‌లో యువతరం ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు అబ్బురపరిచే కార్యక్రమాలు నిర్వహించారు. అర్ధరాత్రి దాటే వరకు రోడ్లపై తిరుగుతూ పటాకులు కాల్చి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. అయితే పోలీసులు ముమ్మరంగా డ్రంక్ డ్రైవ్ (డ్రంక్ అండ్ డ్రైవ్) తనిఖీలు నిర్వహించి డ్రగ్స్ బానిసలను పట్టుకున్నారు. హైదరాబాద్, సాయిబారాబా కమిషనరేట్ల పరిధిలో 2700కు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో హైదరాబాద్‌లో 1500 కేసులు, సైబరాబాద్‌లో 1241 కేసులు నమోదయ్యాయి.

Read also: New Year 2024: వామ్మో.. హైదరాబాదీలు అన్ని లక్షల కేజీల చికెన్ ను కుమ్మేశారా?

×
×
Ad

రాచకొండలో 517 కేసులు నమోదయ్యాయి. మొత్తం మూడు కమిషనరేట్ల పరిధిలో 3500లకు పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. సైబరాబాద్ పరిధిలో ఇద్దరు మహిళలు సహా మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 1239 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మద్యం తాగి వాహనాలు నడిపిన కేసుల్లో 938 బైక్‌లు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను సీజ్ చేశారు. పలుచోట్ల వాహనదారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. మరోవైపు జంటనగరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు. నగరంలోని ఫ్లై ఓవర్లు, ఓఆర్‌ఆర్‌లను ఆదివారం రాత్రి 8 గంటలకు మూసివేశారు. PV ఎక్స్‌ప్రెస్‌వేలో ఫ్లైట్ టికెట్ ఉన్నవారిని మాత్రమే అనుమతిస్తారు.
Gujarat : ముగ్గురు పిల్లలతో రైలుకింద దూకి ఆత్మహత్య చేసుకున్న తండ్రి