Site icon NTV Telugu

Moinabad Farmhouse Drug Case: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో కీలక సమాచారం సేకరించిన సిట్

Moinabad

Moinabad

మొయినాబాద్ ఫార్మ్‌హౌస్ డ్రగ్స్ కేసులో ప్రత్యేక విచారణ బృందం (SIT) దర్యాప్తును ముమ్మరం చేస్తూ కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ కేసులో భాగంగా ముగ్గురు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న అధికారులు, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి డ్రగ్ పెడ్లర్లతో ఉన్న సంబంధాలపై లోతుగా విచారణ జరిపారు. ముఖ్యంగా రోహిత్ రెడ్డి గత ఐదు నెలల కాలంలోనే సుమారు 10 సార్లు దుబాయ్ వెళ్లినట్లు సిట్ గుర్తించింది, ఈ క్రమంలో అక్కడ జరిగిన డ్రగ్స్ పార్టీల వ్యవహారాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో మొయినాబాద్ ఫార్మ్‌హౌస్‌లో జరిగిన పార్టీల్లో ఎవరెవరు పాల్గొన్నారు అనే అంశంతో పాటు, ఢిల్లీకి చెందిన వ్యాపారి నమితా శర్మతో రోహిత్ రెడ్డికి ఉన్న సంబంధాలపై కూడా సిట్ బృందం కూపీ లాగుతోంది.

Bengal hostage row: ఎంఐఎం నాయకుడే మల్దా ఘటన సూత్రధారి.. పారిపోతుండగా అరెస్ట్..

రెండోసారి కస్టడీ విచారణలో భాగంగా కాల్పుల వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించిన అధికారులు, ఆ రోజు జరిగిన మీటింగ్‌లో వ్యాపారులు , రాజకీయ నేతలు ఏయే అంశాలపై చర్చించారు అనే దానిపై నిందితులపై ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయ నేతలు , వ్యాపారవేత్తల మధ్య జరిగిన ఈ చర్చల వెనుక ఉన్న అసలు ఉద్దేశాలను వెలికితీసే ప్రయత్నం జరుగుతోంది. నిందితుల మూడు రోజుల కస్టడీ నేటితో ముగియడంతో, పోలీసులు వారిని కోర్టులో హాజరుపరచనున్నారు. సిట్ సేకరించిన ఈ కీలక సమాచారంతో ఈ కేసులో మరిన్ని సంచలన విషయాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

AP Weather Alert: అలర్ట్.. 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగుల వర్షం..!

Exit mobile version