Site icon NTV Telugu

KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలి..

మోడీ పార్లమెంట్‌లో అసభ్యకరంగా మాట్లాడాడని, పనికి మాలిన మాటలు చెప్పారని మంత్రి కేటీఆర్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. విశ్వాసం కల్పించాల్సిన వారు విద్వేషాలు రెచ్చగొట్టారని, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి మాటలు మాట్లాడిన ప్రధాని లేరని ఆయన మండిపడ్డారు. అంతేకాకుండా చేవెళ్ల ప్రాణహిత కోసం జాతీయ హోదా ఇవ్వలేదని, రైతు చట్టాలను పోరాటాలు ద్వారా వెనక్కి తీసుకున్నారని ఆయన గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మోడీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. గుజరాత్ కంటే తెలంగాణ అభివృద్ధి చెందుతుందన్న కడుపు మంట మోడీకి ఉందని, మన తెలంగాణ రాష్ట్రం నుండి 7 మండలాలను బలవంతంగా ఏపిలో కలిపారని ఆయన అన్నారు. భేటి బచవో భేటి పడవో అని మత విశ్వాసాలు రెచ్చగొట్టారని, అంబేద్కర్ చెప్పినట్టే బోధించు సమీకరించు పోరాడు అనే నినాదం తోనే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని ఆయన వెల్లడించారు. విభజనపై ఉన్న అక్కసును మోడీ బయటపెట్టారని ఆయన అన్నారు. తెలంగాణపై వివక్ష చూపడం ఆపాలని ఆయన అన్నారు.

Exit mobile version