Site icon NTV Telugu

Cyclone: బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం..

Telangana Rains

Telangana Rains

Cyclone: దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండంగా ఏర్పడింది. దీంతో హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు అలర్ట్‌ చేసింది. వాయుగుండం ప్రభావంతో తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణ రాష్ట్రానికి నేడు రేపు వర్షాలు పడాతయని వెల్లడించింది. పూర్తిగా నైరుతి రుతుపవనాలు తిరోగమించాయని తెలిపింది. రాష్ట్రంలోకి ఈశాన్య రుతుపవనాలు ఎంటర్ అయ్యాయని తెలిపింది. ఈశాన్య రుతుపవనాల సమయంలో ఈదురుగాలతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈశాన్య రుతుపవనాల రాక సమయంలో తీవ్ర ఉక్కపోత వాతావరణం నెలకొంటుందని వెల్లడించింది. రాష్ట్రంలో పలు చోట్ల ఇప్పటికే 34 డిగ్రీల పగటిపూట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఏపీకి సమీపాన ఉన్న తెలంగాణ జిల్లాలకు వాయుగుండం ప్రభావం ఉంటుండనుంది. దీని ప్రభావంతో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.

Read also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఇవాళ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. కాగా, కృష్ణా బేసిన్‌లో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర, కృష్ణా నదులకు స్వల్పంగా వరద కొనసాగుతోంది. కర్ణాటకలోని నారాయణపూర్ ప్రాజెక్టుకు బుధవారం 55 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 50 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు 40 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు 73,573 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.1 అడుగులకు చేరుకుంది. నాగార్జునసాగర్‌కు 67,676 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో (312 టీఎంసీలు) 4 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 32,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
Tollywood : అనుకున్నట్టుగానే ఆ సినిమాకు ‘A’ సర్టిఫికెట్..

Exit mobile version