MLC Pochampally Srinivas Reddy: సరంపేటలో పూర్తి మెజారిటీ.. కేసీఆర్ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అత్యంత ప్రతిష్టాత్మకంగా సాగిన మునుగోడు ఉప పోరులో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మునుగోడులో అన్ని రౌండ్లలో టీఆర్ఎస్ తన సత్తా చాటుకుంది. టీఆర్ఎస్ నాయకులంతా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయానికి అవిరళ కృషిచేశారు. సరంపేటలో టీఆర్ఎస్ కు అత్యధిక మెజారిటీ లభించింది. సీఎం కేసీఆర్ ఇంఛార్జిగా ఉన్న మునుగోడు లోని సరంపేటలో టీఆర్ఎస్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది.
Read Also: TRS Mps On Munugode Bypoll: మునుగోడు ఓటర్లు కేసీఆర్ కు అండగా నిలిచారు
Also Read
- Rain Forecast: మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
- Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
- CM Revanth Reddy: 22-ఏ భూములపై సీఎం కీలక సమీక్ష.. 2 రోజుల్లోనే పరిష్కారం..! దళారులను ఆశ్రయించవద్దు..
- TGSRTC Bus Route Changes: కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే ఎఫెక్ట్... ఆర్టీసీ బస్సు రూట్లలో కీలక మార్పులు.. పూర్తి వివరాలు ఇవిగో..
ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో గజ్వేల్ నాయకులు ఇక్కడ ఎన్నిక ప్రచార బాధ్యతలు చూశారు. సరంపేటలో మొత్తం 1082 ఓట్లు ఉండగా 998 పోలయ్యాయి. ఇందులో టీఆర్ఎస్ కు 666 ఓట్లు వచ్చాయి. BJP కి 209.. కాంగ్రెసుకు 43 ఓట్లు పడ్డాయి. 15 రౌండ్లలో కౌంటింగ్ జరగగా సరంపేట ఉన్న 12రౌండ్ లో TRS కు అత్యధికంగా 2 వేల మెజారిటీ వచ్చింది. మునుగోడు ఉప ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు,నాయకులకు,ప్రజా ప్రతినిధులకు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు ఉప ఎన్నికలో విజయంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ విజయం సాధించడంతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్‌ఎస్ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగితేలాయి. నాయకులు, కార్యకర్తలు నృత్యాలు చేస్తూ, పటాకులు కాలుస్తూ, స్వీట్లు పంచిపెడుతూ సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్.. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సందడిగా మారింది.
Read Also: KA PAUL Live at Munugode: ఇళ్ళిళ్ళూ తిరుగుతూ ఓట్లు లెక్కిస్తున్న పాల్
తాజావార్తలు
-
Skoda Slavia Facelift: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ 2026 వచ్చేసింది.. 360° కెమెరా, రియర్ సీట్ మసాజ్‌తో అదిరిపోయే ఫీచర్లు
-
Rain Forecast: మరో గంటలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..
-
IND vs SL: విజయం ముంగిట భారత్.. వరుణుడు కరుణిస్తాడా..?
-
Fire Accident: పాతబస్తీలో అగ్నిప్రమాదం.. క్షణాల్లో వ్యాపించిన పొగ.. భయాందోళనలో ప్రజలు..
-
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
ట్రెండింగ్
-
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ అరుదైన ఘనత.. పుజారా కూడా సాధించలేని రికార్డు భయ్యో!
-
మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 144Hz AMOLED డిస్ప్లే, 6500mAh బ్యాటరీతో POVA 8 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
165Hz డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR Pad 20 Pro Paperlike Edition లాంచ్..!
-
IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 10,000mAh బ్యాటరీతో ఆగస్టు 27న రాబోతున్న Redmi Note 17 Pro Max 5G.. ఫీచర్లు ఇవే..!
-
Harry Brook-IPL: ఐపీఎల్ అంటేనే భయమేసింది.. డిప్రెషన్లోకి వెళ్లా.. ఇంగ్లండ్ స్టార్ సంచలన వ్యాఖ్యలు!