NTV Telugu Site icon

MLC Kavitha: నేడు కేసీఆర్‌ను కలువనున్న ఎమ్మెల్సీ కవిత..

Kcr Kavitha

Kcr Kavitha

MLC Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత నేడు తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. ఉదయం 10.30 గంటలకు ఆమె ఇంటి నుంచి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత తొలిసారిగా కవిత తన తండ్రిని కలవబోతున్నారు. సుమారు ఐదున్నర నెలల తరువాత కేసీఆర్ ను ఆమె కలవనున్నారు. నిన్న హైదరాబాద్ చేరుకున్న కవిత కుమార్తెతో కేసీఆర్ ఫోన్ లో మాట్లాడారు. ఈరోజు భోజనానికి రమ్మని కవితను ఆహ్వానించారు. ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్‌లో అరెస్టయి ఐదున్నర నెలల పాటు తిహాద్ జైలులో ఉన్న కవితకు ఈ నెల 27న బెయిల్ లభించిన విషయం తెలిసిందే.

Read also: Wrong Driving: దిమ్మతిరిగే షాక్.. రాంగ్ రూట్ లో వెళ్తే లైసెన్స్ లు రద్దు..

అయితే నిన్న (28) లిక్కర్ కేసు సిబిఐ చార్జ్ పై ట్రయల్ కోర్టులో విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. దీంతో ట్రయల్ కోర్ట్ విచారణకు ఎమ్మెల్సీ కవిత, మనిస్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్ గా హాజరయ్యారు. వాదనలు అనంతరం లిక్కర్ కేసు సీబిఐ ఛార్జ్ షీట్ పై విచారణను సెప్టెంబర్ 11 వ తేదీన జడ్జి కావేరి భవేజా వాయిదా వేశారు. దీంతో విచారణ అనంతరం మధ్నాహ్నం కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు పయనమయ్యారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆమెకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అయితే.. ఈ సందర్భంగా కవితపై పార్టీ శ్రేణులు పూలవర్షం కురిపించాయి.

Read also: Nagarjuna Sagar: నాగార్జున సాగర్ కు కొనసాగుతున్న భారీ వరద..

తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన వారిని చూసిన కవిత పిడికిలి బిగించి జై తెలంగాణ అంటూ నినదించారు. అనంతరం భారీ కార్ల ర్యాలీతో సాయంత్రం జూబ్లీహిల్స్‌ని నివాసానికి చేరుకున్నారు. తన ఇంటికి చేరుకున్న అనంతరం సోదరుడు కేటీఆర్ కు రాఖీ కట్టారు కవిత. తన కుటుంబ సభ్యులను ఆలింగనం చేసుకున్న కవిత.. తన తల్లి శోభమ్మ పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎమ్మెల్సీ కవితకు మంగళహారతి ఇచ్చి ఇంట్లోకి స్వాగతం పలికారు కుటుంబ సభ్యులు.. కుటుంబ సభ్యులను చూసి ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు కవిత.. కవితను చూసి కుటుంబ సభ్యులు సైతం భావోద్వేగానికి లోనయ్యారు. కాగా.. ఇవాళ తన తండ్రి కేసీఆర్ ను కలవనున్నారు కవిత.
Komatireddy Venkat Reddy: నల్గొండ నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన..