MLC Kavitha: కాళేశ్వరం కమిషన్ నివేదిక నేపథ్యంలో కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీకి ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ మీద విచారణ వేసిన తర్వాత తొక్కలో పార్టీ ఉంటే ఎంత లేకుంటే ఎంత.?అని ఆమె వ్యాఖ్యానించారు. నేను ఇలా మాట్లాడితే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టం జరగొచ్చని, నష్టం జరిగినా సరే నేను ఇలానే మాట్లాడుతా అంటూ ఆమె ఉద్ఘాటించారు. మొదటిసారి పార్టీకి, కేసీఆర్‌కు నష్టం చేస్తున్నవారి పేర్లు బయటపెడుతున్నానని, హరీష్‌రావు, సంతోష్‌రావు దుర్మార్గుల వల్లనే కేసీఆర్‌కు ఈ పరిస్థితి వచ్చిందని ఆమె సంచలన ఆరోపణ చేశారు. ఖబడ్దార్ ఎంతవరకు వెళ్లినా నేను తేల్చుకుంటానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ మీద విచారణ అంటే తెలంగాణ బంద్‌కు పార్టీ ఎందుకు పిలుపునివ్వలేదు.? అని ఆమె ప్రశ్నించారు.
Nellore : ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై హత్యాయత్నం 8 రౌడీషీటర్ల అరెస్ట్
ఈ సమయంలో తెలంగాణ భగ్గుమనాలి.. కానీ పార్టీ ఇలా ఉండటం ఏంటి.? అని కవిత మండిపడ్డారు. నాపై కుట్రలు చేసినా సహించా.. కేసీఆర్‌పై ఆరోపణలు తట్టుకోలేకపోతున్నా అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఐదేళ్లు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్‌రావుది ఇందులో మేజర్ పాత్ర లేదా.? అని ఆమె అన్నారు. హరీష్‌రావును రెండోసారి ఇరిగేషన్ మంత్రిగా అందుకే కేసీఆర్ తప్పించారని, హరీష్, సంతోష్ ఎన్నో కుట్రలు చేసినా నేను భరించానని, మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్‌లో కేసీఆర్‌కు మరక అంటడానికి ఇద్దరు ముగ్గురే కారణమన్నారు కవిత. వీళ్లు సొంత వనరులు, ఆస్తులు పెంచుకోవడం కోసం ఇలా చేశారని, ఇటువంటి వారిని ఎందుకు భరించాలి.? కేసీఆర్‌కు ఈ వయసులో సీబీఐ ఎంక్వైరీ ఎందుకండి.? అని ఆమె అన్నారు.
Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పోస్టర్ వచ్చేసింది.. చూశారా!
