Site icon NTV Telugu

MLC Kavitha : మరోసారి ఎంపీ అర్వింద్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించిన కవిత..

Kavitha

Kavitha

నిజామాబాద్‌ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ మరోసారి సెటైర్లు వేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. పసుపు బోర్డు తెస్తానంటూ అబద్ధపు హామీలను ఇచ్చి ధర్మపురి అరవింద్ ఎంపీగా గెలిచారని కవిత అన్నారు. ఆయన ధర్మపురి కాదని, అధర్మపురి అని విమర్శినస్త్రాలు సంధించారు. పసుపుబోర్డు తెస్తానని బాండ్ పేపర్లపై హామీ ఇచ్చిన అర్వింద్‌.. 3 ఏళ్లైనా పసుపుబోర్డు తీసుకురాలేదని మండిపడ్డారు. మోసం చేసిన ఎంపీ ఆర్వింద్‌ను ఎక్కడికక్కడ రైతులు అడ్డుకుంటారని కవిత వ్యాఖ్యానించారు. కేంద్రం నుంచి ఆయన తెచ్చిన నిధులు కూడా ఏమీ లేవన్న కవిత.. తాను ఎంపీగా ఉన్నప్పుడు పసుపు బోర్డు కోసం ఎంతో ప్రయత్నించానని వెల్లడించారు.

ప్రధాని మోదీని, అప్పటి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కూడా పసుపుబోర్డు విషయమై కలిసినా.. ఎలాంటి ప్రయోజనం లేదని ఆమె వివరించారు. అర్వింద్‌కు తాము ఇప్పటికే మూడేళ్ల సమయం ఇచ్చామని… ఇకపై ఉపేక్షించబోమని కవిత హెచ్చరించారు. బీజేపీ శ్రేణులు తమపై దాడులకు పాల్పడాలని చూస్తే ఊరుకోబోమని, తెలంగాణ ఉద్యమ సమయంలో పారామిలిటరీ బలగాలను ఎదుర్కొన్న అనుభవాలు తమకు ఉన్నాయని ఆమె ఘాటుగా స్పందించారు.

Exit mobile version