Site icon NTV Telugu

MLC Kavitha : అబద్ధానికి ప్రతి రూపం ఎంపీ ధర్మపురి అరవింద్

Kavitha

Kavitha

జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కోరుట్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లు కల్వకుంట్ల కవిత, ఎల్ రమణలు హజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్‌ గెలుపొందడమే మన ధ్యేయంగా అందరూ ముందుండాలన్నారు. గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద టీఆర్‌ఎస్‌ అభివృద్ధిపై కార్యకర్తలు చర్చ జరపండని, తెలంగాణ వచ్చిందే యువకుల కోసం, అలాంటి యువత కోసం ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు.

అబద్ధానికి ప్రతి రూపం ఎంపీ ధర్మపురి అరవింద్ అంటూ విమర్శలు గుప్పించారు. కేంద్రం చేసిన అభివృద్ధి ఏమి లేదు కానీ ప్రజల నెత్తిన రేట్లు పెంచుతున్నారని ఆమె మండిపడ్డారు. జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎప్పుడూ టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్నారే తప్ప కేంద్రంపై మాట్లాడకపోవడం చూస్తుంటే బీజేపీతో మ్యాచ్ ఫిక్సింగ్‌ల ఉందని ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Exit mobile version