తెలంగాణ విషయంలో మోడీ వ్యాఖ్యలు రాజకీయాలను వేడెక్కించాయనే చెప్పాలి. తెలంగాణ విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలయుద్ధం కొనసాగుతూనే వుంది. తాజాగా కాంగ్రెస్ తెలంగాణ ఇంచార్జి, మానిక్కం ఠాకూర్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. నాటిఉద్యమ నాయకులు , సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా పోరాటం ద్వారా తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల కాదు.
అహింసా మార్గంలో కేసీఆర్ చేపట్టిన పోరాటంలో ప్రజలంతా ఆయనతో కలిసి రావడం, ఆనాడు ప్రభుత్వంలో ఉన్న మీపై ఒత్తిడి పెరగడం వల్ల తెలంగాణ ఇచ్చారు కానీ అది ఎవరి భిక్ష కాదు. ప్రజా పోరాటంలో ఆఖరికి సత్యమే గెలిచింది. భారతదేశ మాజీ ప్రధాని, అతని కుటుంబాన్ని అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వ శర్మ అనరాని మాటలు అంటే రాజకీయాలకు అతీతంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ రాహుల్ గాంధీకి అండగా నిలబడ్డారు. అది కేసీఆర్ గారి స్థాయి, గొప్పతనం.దయచేసి ఇంకోసారి కేసీఆర్ గారి గురించి రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేసే ముందు ఆలోచించుకోవాలని ఎమ్మెల్సీ కవిత కౌంటరిచ్చారు.
అంతకుముందు.. సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ ఇంఛార్జి మానిక్కం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్ ట్వీట్లు. ఊసరవెల్లి అంటూ ఠాగూర్ ట్వీట్. ఊసర వెల్లికి కేసీఆర్ రోల్ మోడల్ అంటూ రేవంత్ రీట్వీట్ చేశారు.
