Site icon NTV Telugu

MLC Kavitha : హరీష్‌రావు వల్లే కేసీఆర్‌పై సీబీఐ ఎంక్వైరీ.. ఇప్పుడు వాళ్ళ పేర్లు చెబుతున్నా..

Mlc Kaviithav

Mlc Kaviithav

MLC Kavitha : మాజీ సీఎం కేసీఆర్‌పై సీబీఐ విచారణ వ్యవహారంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ను అవినీతి ఆరోపణలతో లాగడం వెనుక హరీష్‌రావే కారణమని కవిత సంచలన ఆరోపణ చేశారు. “తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. ఆయనకు తిండి మీద, డబ్బు మీద ఎప్పుడూ యావ ఉండదు. అలాంటి నాయకుడిని అవినీతి మచ్చతో మసకబార్చారు. నిజాం కంటే కేసీఆర్ ఆస్తిపరుడు కావాలని అనుకున్నాడు అంటున్నారు.. నిజంగానే నిజాం స్ఫూర్తి గానే సాగుతాం,” అని కవిత వ్యాఖ్యానించారు.

US: రష్యన్ ఆయిల్ బ్రహ్మణులకే లాభదాయకం.. ట్రంప్ సలహాదారుడి వివాదాస్పద వ్యాఖ్యలు..

అంతేకాకుండా.. “కేసీఆర్ పక్కన ఉన్న కొందరి వల్లే ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అయినా వారినే మోస్తున్నారు. ఇదంతా హరీష్‌రావు వల్లే జరిగింది. అందుకే ఆయనను రెండోసారి ఇరిగేషన్‌ మంత్రిగా తప్పించారు. హరీష్‌రావు, సంతోష్‌రావు నా మీద కూడా కుట్రలు చేశారు. వీరి వెనుక సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నారు,” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. “దేవునిలాంటి నా నాన్నపై సీబీఐ విచారణ జరుగుతుండటం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇంతవరకు వాళ్ల పేర్లు చెప్పలేదు.. ఇప్పుడు స్పష్టంగా చెబుతున్నాను,” అని కవిత హరీష్‌రావుపై నేరుగా బాణాలు సంధించారు.

Putin: మోడీ కోసం పుతిన్ వెయిటింగ్.. ఇది కదా భారత్-రష్యా స్నేహం..

Exit mobile version