MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇవాళ రూస్ అవెన్యూ కోర్టుకు హాజరయ్యారు. కవిత లోపలికి వెళ్లే ముందు ఆమె మీడియాతో మాట్లాడారు. నేను అప్రూవర్ గా మారేది లేదు.. కడిగిన ముత్యంలా బయటికి వస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదు, పొలిటికల్ లాండరింగ్ కేసు అన్నారు. తాత్కాలికంగా జైల్లో పెట్టొచ్చు కానీ.. ఒక నిందితుడు ఆల్రెడీ బిజెపిలో చేరాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకో నిందితుడు బీజేపీ టికెట్ ఇచ్చిందని అన్నారు. మూడో నిందితుడు రూ.50 కోట్లు ఎలక్ట్రోరల్ బాండ్ల రూపంలో బీజేపీకి ఇచ్చాడని తెలిపారు. క్లీన్ గా బయటకు వస్తా.. అప్రూవ్ వర్ గా మారేది లేదని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్సీ కవిత పిల్లలకు పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో.. దయచేసి మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కవిత తరపు న్యాయవాది, ఇరువైపులా వాదనలు ముగిసాయి. అయితే ఈ తీర్పును జడ్జి రిజర్వ్ చేశారు. వచ్చే నెల 16 వరకు చిన్న కొడుకుకు పరీక్షలు ఉన్నాయని.. అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోర్టును కోరిన ఎమ్మెల్సీ కవిత. కాగా.. కవిత అభ్యర్థనపై జడ్జి కావేరి బవేజ ఆర్డర్ రిజర్వ్ చేశారు.
Read also: Kakarla Suresh: విభేదాలు వీడి ఐకమత్యంతో విజయం సాధిద్దాం..!
నేటితో ఎమ్మెల్సీ కవిత ఈడి కస్టడీ ముగియనుంది. ఇవాళ రౌస్ ఎవెన్యూ స్పెషల్ కోర్టులో ఈడి అధికారులు కవితను హాజరు పర్చనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. మార్చి 15న హైదరాబాదులో లిక్కర్ కేసులో కవితను ఈడి అరెస్ట్ చేశారు. ఈడి కస్టడీలో లిక్కర్ స్కాంలో అధికారులు కవిత పాత్రపై ఇంటరాగేషన్ చేశారు. ఇప్పటికే లిక్కర్ కేసులో పలువురు నిందితులు అరెస్టై వాంగ్మూలం ఇచ్చారు. నిందితుల వాంగ్మూలాలపై ఈడి అధికారులు కవిత నుంచి క్లారిటీ తీసుకున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ తో కలిపి విచారించేందుకు మరో రెండు రోజుల కస్టడీ పొడగించాలని కోర్టును ఈడి కోరే అవకాశం ఉంది. ఇప్పటికే ట్రయల్ కోర్టులో కవిత బెయిల్ పిటిషన్ వేశారు. ఈ రెండు వాదనలను రోస్ అవెన్యూ కోర్టు ఇవాళ వినే అవకాశం ఉంది. మరోసారి కవితను ఈడీ కస్టడీకి ఇస్తారా? లేక జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు ఇస్తుందా? రెండూ లేకుండా బెయిల్ మంజూరు చేస్తుందా? అనే అంశాలపై ఇవాళ స్పష్టత వస్తుందని అంటున్నారు.
