Fans are Innovatively Wishing MLC Kalvakuntla Kavitha Birthday.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా అభిమానులు పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ చెందిన చిన్ను గౌడ్ అరేబియా మహా సముద్రం ఒడ్డున మహాబలేశ్వర ఆలయంలోని ఆత్మలింగం సమీపాన సముద్రంలో పది పడవలపై ఎమ్మెల్సీ కవిత ఫొటోలతో కూడిన గులాబీ రంగు జెండాలను ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తి నిజామాబాద్ భూమారెడ్డి ఫంక్షన్ హాల్ వేదికగా నేలపై 18 వేల నాణాలతో 12 అడుగుల కవిత బొమ్మను పేర్చాడు.
దాని కింద హ్యాపీ బర్త్ డే కవితక్క అని రాసి తన ఆప్యాయతను చాటుకున్నాడు. దీంతో పాటు మరో ఇద్దరు టీఆర్ఎస్ నేతలు కల్వకుంట్లకు కవితకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. ఏకంగా చారిత్రాత్మక కట్టడం చార్మినార్కు ఫ్లెక్సీలు కట్టారు. దీంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కల్వకుంట్ల కవితపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు అభిమానులు ఆమె పుట్టిన రోజు ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.