MLA Kalvakuntla Kavitha Speech On International Womens Day: మహిళలు ఎప్పుడూ వంట గదిలోనే ఉండాలన్న రోజులు పోవాలని, దాని కోసం ప్రతి మహిళ ఆలోచన చేయాలని ఎమ్మెల్సీ కవిత సూచించారు. పురుషుల కంటే మహిళలు ఎక్కువ సమయం పని చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో కవిత మాట్లాడుతూ.. నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలన్న ఉద్దేశంతో.. గ్రామాల్లో పాఠశాలలను తెలంగాణ ప్రభుత్వం సుందరంగా తీర్చిదిద్దిందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మొత్తం 30 లక్షల కొలువులను కేసీఆర్ సర్కార్ ఇచ్చిందన్నారు.
Satyavathi Rathod: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేస్తోంది
తన తల్లి తనను ఆ కాలంలో పట్టుబట్టి మరీ ఇంగ్లీష్ మీడియం చదివించిందని, అందుకు తాను మానుకొండూర్ గడ్డ మీద నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నానని కవిత చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా గ్రామాల్లోని మహిళలకు వడ్డీ రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరంలో రూ.18 వేల కోట్ల రుణాలను తెలంగాణ ప్రభుత్వం మహిళలు అందించిందని తెలియజేశారు. పేద కుటుంబాలకు కచ్ఛితంగా ఇల్లు కట్టుకోవడం కోసం రూ.3 లక్షలు అందజేస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, మాయమాటలు చెప్పడం తప్ప చేతల్లో చేసి చూపించిదేమీ లేదని మండిపడ్డారు. పాలు, పెరుగు మీద కూడా బీజేపీ ప్రభుత్వం పన్ను వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో గోసి గొంగడి వేసుకొని, ప్రజలను చైతన్యం చేసిన వ్యక్తి ఎమ్మెల్యే రసమయి అని పేర్కొన్నారు. ఈసారి ఎమ్మెల్యేగా రసమయిని 60 వేల ఓట్ల మెజారిటీతీ మన మహిళలు గెలిపించాలని కోరారు.
Harish Rao: మహిళలకు మరో కానుక.. వడ్డీ లేని రుణం
అంతకుముందు.. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రూ. 50 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ హబ్‌ను త్వరలో ప్రారంభించనున్నామని కవిత వెల్లడించారు. ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలను తీసుకువెళ్లాలన్న సంకల్పంతో.. సీఎం కేసీఆర్ ఐటీ హబ్‌లను నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. నిజామాబాద్‌లో ఐటీ హబ్ నిర్మాణానికి కేసీఆర్, కేటీఆర్ ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. ఈ ఐటీ హబ్‌లో 750 మంది యువతకు, నాలుగు వేల మంది ఇతర ప్రాంతవాసులకు ఉద్యోగ, ఉపాధికి అవకాశం లభిస్తుందన్నారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్‌కు రానున్నాయని, ఇప్పటికే 200 పైచిలుకు సీట్ల ఒప్పందాలు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు.