MLC Jeevan Reddy: తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రజలను దగా చేస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLC Jeevan Reddy Fires On CM KCR And Telangana Govt: తెలంగాణ ప్రభుత్వం దశాబ్ద కాలంగా ప్రజలను దగా చేస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పీసీసీ పిలుపు మేరకు.. జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులు ‘దశాబ్ది దగా’ పేరిట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ ర్యాలీకి వివిధ గ్రామాల నుండి భారీ స్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు. ఇందిరా భవన్ నుండి తహసిల్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి.. చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. సీఎం కేసీఆర్ ఫొటోకు పది తలలు అంటించి.. ఒక్కో తలకు ఒక్కో ప్రభుత్వ వైఫల్యాన్ని రాసి ఊరేగించారు. ఆ తర్వాత కేసీఆర్ దిష్టబొమ్మను దహనం చేశారు. అనంతరం రెవెన్యూ డివిజనల్ అధికారికి వినతి పత్రం అందజేశారు.
Minister Harish Rao: కేసీఆర్ పాలనలో తెలంగాణకి అవార్డులే అవార్డులు
Also Read
- Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
- Indiramma House: మోడ్రన్ టెక్నాలజీ వచ్చేసింది.. 12 రోజుల్లోనే ఇందిరమ్మ ఇంటి నిర్మాణం..
- CM Revanth Reddy : కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రా.. పాలమూరును బొందపెట్టింది నువ్వే
- Spa Center Raids : స్పా సెంటర్ల ముసుగులో గలీజ్ దందా.. 113 చోట్ల పోలీసుల మెగా రైడ్స్!
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తోందని, రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేశారని ఆరోపించారు. గ్రామాల్లో బెల్టు షాపులతో ‘ఎనీ టైం మనీ’ తరహా మద్యం అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మద్యం అమ్మకాల్లో తెలంగాణ అభివృద్ధి చెందిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రాథమిక స్థాయి నుండి విశ్వ విద్యాలయం వరకు విద్యను అమ్మకానికి పెట్టారని మండిపడ్డారు. కెసిఆర్ దళితులను, బలహీన వర్గాలను దగా చేస్తున్నారని పేర్కొన్నారు. తొమ్మిదేళ్లలో రాష్ట్రాన్ని రు.6 లక్షల కోట్ల అప్పుల ఉబిలోకి నెట్టారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో ఒక్క ఎకరానికి అయినా అదనంగా సాగు నీరు అందించారా..? అని నిలదీశారు. ఎస్ఆర్ఎస్‌పీ కాలువలకు తొమ్మిదేళ్లుగా మరమత్తులు చెపట్టలేదన్నారు. మిషన్ భగీరథ పేరిట రు.40 వేల కోట్లు అప్పుల భారం మోపారని ఆరోపణలు గుప్పించారు. అందరికీ సమాన విద్య అంటూ.. ‘కేజీ టు పీజీ’ హామీ అమలు చేయలేదని ఆగ్రహించారు.
CM KCR: తెలంగాణలో పరిస్థితి తారుమారు అయ్యింది.. మోసపోతే గోసపడతాం
తాజావార్తలు
-
Varanasi: రాముడు vs కుంభకర్ణుడు.. ఆ 30 నిమిషాల సీక్వెన్స్ ఆడియన్స్‌కు మైండ్ బ్లాకే.! జక్కన్న స్క్రిప్ట్ మాములుగా లేదుగా.!
-
TMC Rebellion: కోల్‌కతా టు ఢిల్లీ.. పార్లమెంట్‌కు పాకిన టీఎంసీ తిరుగుబాటు సెగ.. దీదీకి తప్పని అగ్నిపరీక్ష!
-
Today Gold and Silver Prices: పసిడి ధరలో భారీ పతనం.. వెండి కూడా చౌకైంది.. 22, 24 క్యారెట్ ధరలు ఎంతంటే?
-
Peddi vs Drishyam : మోహన్ లాల్‌కు “పెద్ది” దెబ్బ…. విదేశాల్లోనూ షాకే!
-
Delhi: అభిజీత్ దిప్కే పిలుపునకు భారీ స్పందన.. ‘కాక్రోచ్ మాస్కులు’ ధరించి నిరసన బాట పట్టిన యువత..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!