NTV Telugu Site icon

MLC Jeevan Reddy : నేను చెప్పింది తప్పయితే ఎన్నికల్లో పోటీ చేయను

Jeevan Reddy

Jeevan Reddy

ఇటీవల ఏఐసీసీ నేత రాహుల్‌ గాంధీ వరంగల్‌ ఇచ్చిన రైతు డిక్లరేషన్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిందా తిలిస్మాత్‌గా రైతు బంధు మారిందని ఎద్దేవా చేశారు. మంత్రి మల్లారెడ్డి 500 ఎకరాలకు రైతు బంధు ఇస్తున్నారని, రియల్ వ్యాపారులకు ప్లాట్లు చేసి అమ్మిన పట్టాదారు పాస్ బుక్ ఉందని రైతుబంధు తీసుకుంటుండు అంటూ ఆయన విమర్శలు గుప్పించారు.

తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసేది రుణమాఫీ కాదు కేవలం వడ్డీ మాఫీ పథకమని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నుండి రైతులకు కల్పించాల్సిన 4 శాతం వడ్డీ రాయితీలు నిలిపివేసి సొమ్మును మళ్లించారని, నేను చెప్పింది తప్పయితే ఎన్నికల్లో పోటీ చేయనంటూ ఆయన సవాల్‌ విరిరారు. అంతేకాకుండా.. మద్దతు ధర, విత్తనాల రాయితీలు పూర్తిగా నిలిపివేశారని, వడ్డీల రాయితీలు ఇవ్వక కేవలం రైతు బంధు ఇస్తున్నాం చెబుతున్నారన్నారు.

అంతకుమందు.. 31వ రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ప్రపంచ వ్యాప్తంగా శాంతి భద్రతల ప్రయత్నంలో భగంగా రాజీవ్ గాంధీ దుర్మరణం కావడం జరిగిందని, 18 సంవత్సరాల యువకులను ఓటు హక్కు కల్పించిన ఘనత రాజీవ్ గాంధీదని భట్టి గుర్తు చేశారు. ఈ దేశాన్ని 21 వ దశాబ్దానికి తీసుకెళ్లిన రాజీవ్ గాంధీ.. ప్రపంచ దేశలతో పోటీపడే విధంగా భారత దేశం నిర్మాణం చేశారన్నారు.