MLA Sridhar Babu Fires On BRS And BJP Parties: బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని.. ఆ రెండు పార్టీలు కుమ్మక్కై కాంగ్రెస్ మీద రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నాయని ఏఐసీసీ కార్యదర్శి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా తిరిగి ప్రజల్ని ఐక్యం చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బెంబేలెత్తిందని విమర్శించారు. రాహుల్ గాంధీ విషయంలో ఎలాంటి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడినా.. ప్రజలు ఊరుకోరని హెచ్చరించారు. దేశ ప్రజలు రాహుల్ గాంధీ వెంట ఉన్నారని, ఆయనకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా పోరాటం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
Shocking: ఆ సినిమా నుంచి రష్మిక మందన్న అవుట్.. కారణం అదేనా?
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మౌన దీక్షను దెబ్బతీయడానికి బీఆర్ఎస్ తెలంగాణ వ్యాప్తంగా మరో ఉద్యమాన్ని చేపట్టిందని.. రాహుల్ గాంధీపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఆ పార్టీ ఇలా చేస్తోందని శ్రీధర్ బాబు ఆరోపించారు. ఇది కచ్చితంగా బీజేపీ, బీఆర్ఎస్ లోపాయకారి ఒప్పందంలో భాగమేనని ఉద్ఘాటించారు. ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో ఎలాంటి అనుమానాలు వద్దని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్పకుండా 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ఏ ఉద్దేశంతో ‘3 గంటల ఉచిత విద్యుత్’ వ్యాఖ్యలు చేశారో తెలీదన్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే నాయకత్వంలో.. దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
Minister Harish Rao: పదోన్నతులపై అధికారులకు మంత్రి హరీశ్ రావు అదేశాలు..
అంతకుముందు కూడా.. గ్రామాల్లో సంక్షేమ పథకాలు ఆపేస్తామని బీఆర్ఎస్ వాళ్లు బెదిరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీగా దీన్ని ఖండిస్తున్నామని అన్నారు. పోలీసులు బీఆర్ఎస్ ఏజెంట్లుగా పని చేస్తున్నారని, నిజాయితీగా పని చేయాలని హితవు పలికారు. కాంగ్రెస్‌ను దెబ్బతీయడానికి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు.