Amnesia Pub: బాలిక అత్యాచారం కేసులో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా అండ్ ఇన్సోమియా పబ్ నుంచి బాలికను బలవంతంగా కారులో తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో కీలక మలుపు తిరిగింది. నగరానికి చెందిన ఓ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కుమారుడి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడితో పాటు పరారీలో ఉన్న మరో ఐదు మందిని గాలిస్తున్న అధికారులు సూరజ్, హాదీలను అదుపులోకి తీసుకుని ఆ కారును స్వాధీనం చేసుకున్నారు. గత నెల 28న బంజారాహిల్స్ రోడ్ నెం. 14లో నివసించే రుమేనియా దేశానికి చెందిన బాలిక (16) ఓ పార్టీకి హాజరయ్యేందుకు తన ఇంటి సమీపంలో ఉండే హాదీతో కలిసి ఆయన బెంజ్ కారులో (టీఎస్ 09 ఎఫ్‌ఎల్ 6460)లో అమ్నేషియా పబ్‌కు వెళ్లింది.
పథకం ప్రకారం అప్పటికే హాదీ స్నేహితుడు సూరజ్ పబ్‌లో ఉన్నాడు. పార్టీ ముగిసిన తర్వాత తిరిగి వచ్చే సమయంలో తానంతట తాను వెళ్లిపోతానని బాలిక చెప్పినా వినిపించుకోని హాదీ, సూరజ్ బలవంతంగా కారులో ఎక్కించుకుని బయలుదేరారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ముగ్గురు యువకులు బాలికతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆమె కేకలు పెట్టేందుకు యత్నించగా సూరజ్, హాదీలతో పాటు మరో యువకుడు బెంజ్ కారును అక్కడే ఉంచి ఇన్నోవా కారులో బాలికను బలవంతంగా కూర్చొబెట్టుకుని పబ్ వద్దకు తీసుకువచ్చి వదిలి వెళ్లారు.
Also Read
ఇంటికి వెళ్లిన బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు హదీ, సూరజ్‌లతో పాటు మరో ముగ్గురు యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పబ్ నుంచి వెళ్లిన సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన సమయంలో ఆ కారులో ఓ ఎమ్మెల్యే కుమారుడు ఉన్నట్లు తేలింది. అక్కడే వదిలేసిన బెంజ్ కారును తీసుకువచ్చి సీజ్ చేశారు. అయితే.. పబ్‌లోకి బాలికను ఎలా అనుమతించారనే దానిపై ఆరా తీస్తున్నారు. మరోపక్క నిందితుల్లోనూ ముగ్గురు మైనర్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Coolpad Wide-Screen: రూ.13 వేలకే Coolpad వైడ్‌స్క్రీన్ ఫోన్? 16:10 డిస్‌ప్లే, Helio G99 చిప్సెట్తో రానుందా?
-
January 12 Vidudala: సైలెంట్‌గా ఊటీ చేరుకున్న అనిల్ రావిపూడి టీమ్..!
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!